Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంటతడి పెట్టని రోజులేదు... విడుదల కోసం కళ్లు కాయలు కాసేటట్టు చూస్తున్నా : నళిని లేఖ

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులోని ముద్దాయిల్లో ఒకరైన నళిని శ్రీహరన్ జాతీయ మహిళా కమిషన్‌కు ఓ లేఖ రాశారు. ఈ హత్య కేసులో జైలుశిక్ష ఇంకెంతకాలం అనుభవించాలంటూ ప్రశ్నించారు.

Advertiesment
కంటతడి పెట్టని రోజులేదు... విడుదల కోసం కళ్లు కాయలు కాసేటట్టు చూస్తున్నా : నళిని లేఖ
, సోమవారం, 24 అక్టోబరు 2016 (08:54 IST)
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులోని ముద్దాయిల్లో ఒకరైన నళిని శ్రీహరన్ జాతీయ మహిళా కమిషన్‌కు ఓ లేఖ రాశారు. ఈ హత్య కేసులో జైలుశిక్ష ఇంకెంతకాలం అనుభవించాలంటూ ప్రశ్నించారు. తనను సత్వరం విడిచిపెట్టేందుకు చొరవ తీసుకోవాలని ఎన్‌సీడబ్ల్యూను ఆమె కోరారు. ఆమె రాసిన లేఖలో... 
 
'నేను కంటతడి పెట్టని రోజులేదు. విడుదల కోసం కళ్లు కాయలు కాసేటట్టు ఎదురుచూస్తున్నాను. ఎన్నో ముఖ్యమైన రోజులు వస్తున్నాయి... పోతున్నాయి. అసలు ఎప్పటికైనా జైలు నుంచి నాకు విముక్తి లభిస్తుందా? ఆ ఆశలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. దాదాపు డిప్రెషన్‌లోకి జారిపోతున్నాను' అని పేర్కొన్నారు. 
 
'25 సంవత్సరాలుగా జైలులోనే ఉన్నాను. ఇంత సుదీర్ఘకాలం జైలులో ఉన్న మహిళా ఖైదీని నేనే కావచ్చు. నేను కంటితడి పెట్టని రోజంటూ లేదు. అన్నా (డీఎంకే వ్యవస్థాపకుడు) పుట్టినరోజు వంటి ఎన్నో ముఖ్యమైన రోజులు వస్తున్నాయి. వెళ్తున్నాయి. వందలాది మహిళా ఖైదీలు విడుదలవుతున్నారు. దురదృష్టం కొద్దీ నేను మాత్రం విడుదలకు నోచుకోవడం లేదు. జైలు నుంచి ఎప్పటికైనా విడుదలవుతాననే ఆశలు కూడా ఆవిరవుతున్నాయి. యూకేలో ఉన్న నా కూతుర్ని ఎప్పటికైనా చూడగలనా, ఆమెకు పెళ్లి చేయగలనా అనేది కాలమే చెప్పాలి' అంటూ నళిని తన ఆవేదన వ్యక్తం చేసింది. 
 
కాగా, జైలులో చాలాకాలంగా మగ్గుతున్న మహిళా ఖైదీ నళిని అని, తమిళనాడు ప్రభుత్వం రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఉంటే నళిని ఇప్పటికే విడుదలై ఉండేదని, అయితే ప్రభుత్వం నేర శిక్షాస్మృతిలోని నిబంధలను పదేపదే వల్లెవేస్తోందన్నారు. 2000లో జాతీయ మహిళా కమిషన్‌ చొరవ తీసుకోవడంతోనే నళినికి విధించిన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చారని చెప్పారు. కాగా, తాను జైలులో అనుభవిస్తున్న మానసిక వేదనను నళిని ఎన్‌సీడబ్ల్యూ దృష్టికి తీసుకువచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయిబాబా ఓ భూతం.. దేవుడు కాదు.. బదరీ ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద