Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజీవ్ జయంతి సద్భావనా దివస్ : భర్తకు సోనియా నివాళి

Advertiesment
Rajiv Gandhi 75th Birth Anniversary
, మంగళవారం, 20 ఆగస్టు 2019 (09:53 IST)
భారత మాజీ ప్రధానమంత్రి రావీజ్ గాంధీ 75వ జయంతి వేడుకలు మంగళవారం దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి.  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా ర్యాలీలు అన్నదానాలు చేస్తున్నారు. 
 
మరోవైపు, రాజీవ్ జయంతి వేడుకలను పురస్కరించుకుని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇతర కాంగ్రెస్ నేతలు మంగళవారం రాజీవ్ సమాధి వీర్ భూమికి నివాళులు అర్పించారు. 
 
అలాగే, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, గులాం నబీ ఆజాద్, భూపిందర్ సింగ్ హుడా, అహ్మద్ పటేల్ తదితరులు సైతం దివంగత నేతకు నివాళులర్పించారు. ప్రియాంక కుమార్తె మిరయా వాద్రా కూడా హాజరయ్యారు. 
 
కాగా, తన తండ్రి రాజీవ్ జయంతి సందర్భంగా వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పలు స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రాహుల్ సోమవారంనాడు ఓ ట్వీట్‌లో వెల్లడించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న హీరో తరుణ్