రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టడం ఖాయం : టీఎన్‌సీసీ చీఫ్ జోస్యం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఎస్.తిరునావుక్కరసర్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... రజనీ రాజకీయాల్లోకి రావడాన్ని తాము సాదరంగా స్వాగతిస్తామన్నారు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఎస్.తిరునావుక్కరసర్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... రజనీ రాజకీయాల్లోకి రావడాన్ని తాము సాదరంగా స్వాగతిస్తామన్నారు.
అదేసమయంలో రజనీ స్వంతంగా పార్టీని ఏర్పాటుచేయబోతున్నారని, ఆయన ఏ జాతీయ పార్టీలోగానీ, ప్రాంతీయపార్టీలోగానీ చేరబోరన్నారు. ఒక స్నేహితుడిగా రజనీ తనకు గత 35 నుండి 40 యేళ్లుగా తెలుసునన్నారు.
ఆయన ఏ జాతీయ పార్టీలోగానీ, ప్రాంతీయ పార్టీలోగానీ చేరతారని తాను అనుకోవడం లేదన్నారు. ఆయనే స్వంతంగా పార్టీని ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదన్నారు. రజనీ పార్టీ పెడితే ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది ఆయన ఇష్టమన్నారు. దానిపై తానేమీ చెప్పలేనన్నారు.