Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రజనీకాంత్‌కు రాజకీయాలు తెలియవన్న స్వామి- ఇండియన్ మీడియా అంటూ మాల్యా ఎద్దేవా

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు రాజకీయాల గురించి తెలియదని.. ఆయన కేవలం నటుడు మాత్రమేనని.. రాజకీయ నాయకుడు కాదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి సెన్సేషనల్ కామెంట్స్ చేశ

రజనీకాంత్‌కు రాజకీయాలు తెలియవన్న స్వామి- ఇండియన్ మీడియా అంటూ మాల్యా ఎద్దేవా
, మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (18:14 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు రాజకీయాల గురించి తెలియదని.. ఆయన కేవలం నటుడు మాత్రమేనని.. రాజకీయ నాయకుడు కాదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తమిళనాడులో రాజకీయ నాయకులే గొప్ప నటులని స్వామి ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసుపై కూడా స్వామి స్పందించారు. 
 
రాజీవ్ హత్య కేసులో ఏడుగురు నిందితులు జైలు నుంచి విడుదలయ్యే అవకాశమే లేదన్నారు. అలాగే లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా గురించి సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ.. అవినీతి నిరోధించడంలో ప్రధాని మోడీ చొరవను స్వామి కొనియాడారు. విజయ్ మాల్యా జైలుకు వెళ్లే సమయం దగ్గరపడిందన్నారు.
 
విజయ్‌ మాల్యా అరెస్టు ఆరంభం మాత్రమే, తదుపరి లక్ష్యం లలిత్ మోడీనే అని పేర్కొన్నారు. కాగా, వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్ల రుణాలు బకాయిపడి లండన్‌లో తలదాచుకున్న విజయ్ మాల్యాను స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కానీ అరెస్టయిన మూడు గంటల్లోపే మాల్యా విడుదలయ్యాడు. 
 
అంతేగాకుండా విడుదలైన సందర్భంగా ఇండియా మీడియా ఓవరాక్షన్ చేస్తుందని కామెంట్స్ చేశాడు. తాను భారతీయుడనే మాటను మర్చిపోయినా.. దేశ మీడియాపై ఫైర్ అయ్యాడు. అరెస్ట్ అయిన కేవలం మూడు గంటల్లోనే బెయిల్ సంపాదించుకుని బయటకొచ్చేసిన మాల్యా.. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా ఇచ్చారు. ఇదంతా ఊహించినదేనని, ఇండియన్ మీడియా అనవసర ఆర్భాటం చేసిందంటూ పోస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మయన్మార్‌ వాటర్ ఫెస్టివల్- 285 మంది మృతి.. 1073 మందికి గాయాలు..