Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజస్థాన్ ఆలయానికి రూ.9లక్షల రూపాయలకు కొత్తనోట్లు.. విరాళంగా సమర్పించుకున్న భక్తులు

పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ దేవాలయంలోని హుండీలో భక్తులు భారీ విరాళాలు సమర్పించున్నారు. నోట్ల రద్దు వల్ల జనం తమ ఖర్చుల కోసం డబ్బులు విత్

Advertiesment
Rajasthan temple gets donations of over Rs 9 lakh in new 2000
, శనివారం, 3 డిశెంబరు 2016 (11:39 IST)
పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ దేవాలయంలోని హుండీలో భక్తులు భారీ విరాళాలు సమర్పించున్నారు. నోట్ల రద్దు వల్ల జనం తమ ఖర్చుల కోసం డబ్బులు విత్ డ్రా చేసేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు పడినా నగదు దొరకని నేపథ్యంలో రూ. 9లక్షల రూపాయల కొత్త రెండువేల రూపాయల నోట్లను రాజస్థాన్.. చిట్టోర్ ఘర్ పట్టణంలోని సాన్ వాలియాజీ దేవాలయంలో హుండీలో విరాళంగా చేరింది.
 
గడచిన 20 రోజుల్లో రూ.9 లక్షల రూపాయల మేర కొత్త రెండువేలరూపాయల నోట్లను భక్తులు విరాళంగా వేయడంతో దేవాలయ అధికారులు షాక్‌కు గురయ్యారు. నగదు కొరత ఉన్న ప్రస్థుత పరిస్థితుల్లోనూ దేవుడికి భక్తులు కొత్తనోట్లను విరాళం అందించడం ద్వారా తమ భక్తిని చాటుకున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయంలోని హుండీలను తెరచి లెక్కించగా గడచిన రెండు నెలల్లో మొత్తం పాత, కొత్త నోట్లు కలిపి రూ.4.5కోట్ల విరాళాలు వచ్చాయని, ఇందులో 9 లక్షల రూపాయలకు పైగా కొత్త నోట్లు సైతం ఉన్నాయని అధికారులు చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం.. ఆపై క్రికెట్ బ్యాట్‌తో హతమార్చారు..