Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మన్మోహన్ గారూ సారీ.. పొరపాటున అలా మాట్లాడేశా: గులాబ్ చంద్ కటారియా

మాజీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా వెళితే సాధారణ మంత్రులు ఆయనకు ఆహ్వానం పలికేందుకు విమానాశ్రయం వచ్చేవారని.. అదే ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా వెళితే ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామానే స

మన్మోహన్ గారూ సారీ.. పొరపాటున అలా మాట్లాడేశా: గులాబ్ చంద్ కటారియా
, సోమవారం, 20 జూన్ 2016 (14:34 IST)
మాజీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా వెళితే సాధారణ మంత్రులు ఆయనకు ఆహ్వానం పలికేందుకు విమానాశ్రయం వచ్చేవారని.. అదే ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా వెళితే ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామానే స్వయంగా స్వాగతం పలికారంటూ పోలిక తీసుకొచ్చిన రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా క్షమాపణ చెప్పారు. మన్మోహన్ సింగ్‌పై పొరపాటు అలా మాట్లాడేశానంటూ వివరణ ఇచ్చుకున్నారు. 
 
ఆదివారం చురాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో కటారియా మాట్లాడుతూ.. మన్మోహన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు వివాదాన్ని తెచ్చిపెట్టేలోపే వివరణ ఇచ్చుకున్నారు. కటారియా అభ్యంతరకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడటంతో కటారియా క్షమాపణలు చెప్పారు. తాను మాట్లాడుతుండగా పొరపాటున మన్మోహన్ సింగ్ ప్రస్తావన వచ్చిందే కానీ.. ఆయన్ను అవమానించే ఉద్దేశం తమకు లేదని కటారియా వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింహాలను ఫోటో తీయాలనుకున్నాడు.. కెమెరా కూడా ఫిక్స్ చేశాడు.. కానీ ఆడ సింహం ఏం చేసిందంటే?