చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికపై కామాంధుడు అత్యాచారం.. బాలిక పరిస్థితి విషమం..
చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. చాక్లెట్ ఇస్తానని చెప్పి పొరుగింటి బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి.. ఆ బాలికపై అ
చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. చాక్లెట్ ఇస్తానని చెప్పి పొరుగింటి బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి.. ఆ బాలికపై అత్యంత పాశవికంగా ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
సికార్ పట్టణానికి సమీపంలోని గర్హత్క్ నెట్ గ్రామానికి చెందిన ఓ బాలిక అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళుతుండగా హంసరాజ్ అనే 25 ఏళ్ల బాలుడు ఆమెకు చాక్లెట్ ఇస్తానని చెప్పి నిర్జనప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.
తీవ్ర రక్తస్రావంతో బాలికను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను అజిత్ ఘడ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన హంసరాజ్‌ను అరెస్టు చేశారు.