Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దళిత బాలికపై ఎస్ఐ అత్యాచారం.. పట్టుకుని చితకబాదిన స్థానికులు

victim woman
, ఆదివారం, 12 నవంబరు 2023 (10:57 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో ఓ దళిత బాలిక అత్యాచారానికి గురైంది. ఈ దారుణానికి పాల్పడిన కామాంధుడు ఎవరో కాదు. మహిళలతో పాటు సమాజానికి రక్షణ కల్పించాల్సిన పోలీస్ ఎస్ఐ కావడం గమనార్హం. ఈ ఘటన జైపూర్‌ సమీపంలోని దౌసా జిల్లాలో జరిగింది. బాధిత బాలిక వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే. 
 
జిల్లాలోని రహువాస్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న భూపేంద్ర సింగ్ శుక్రవారం బాధిత చిన్నారికి తినుబండారాలు ఆశజూపి తన అద్దె గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి నిందితుణ్ని పట్టుకొని కర్రలు, చెప్పులతో దేహశుద్ధి చేశారు. చిన్నారిపై ఎస్ఐ అత్యాచార ఘటన సమాజానికి సిగ్గుచేటని గవర్నర్ కల్రాజ్ మిశ్రా పేర్కొన్నారు. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.
 
మరోవైపు, ఈ కేసులో కామాంధుడైన ఎస్ఐగా పనిచేస్తున్న నిందితుడు భూపేంద్ర సింగ్‌ను సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. బాలికకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, తన ఆరోగ్యం ప్రస్తుతం స్థిమితంగానే ఉందని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో టీడీపీ - జనసేన పొత్తు : మేనిఫెస్టో రూపకల్పనకు కమిటీ