Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పన్నెండో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. ఆపై కళ్లలో పొడిచారు.. వెన్నెముకను విరిచేశారు..

దేశంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశ ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరుల్లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ఓ బాలికపై దారుణం చోటుచేసుకుంది. 15 బాలి

Advertiesment
Rape
, బుధవారం, 4 జనవరి 2017 (16:52 IST)
దేశంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశ ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరుల్లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ఓ బాలికపై దారుణం చోటుచేసుకుంది. 15 బాలికపై కొందరు దుండగులు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ బాలికను చంపేందుకు దాడి చేశారు. ఈ క్రమంలో కళ్లలో పొడిచి.. బాలిక వెన్నెముకను విరిచేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే రాజస్థాన్థాన్ చురు జిల్లాకు చెందిన 15ఏళ్ల విద్యార్థిని ఓ  ప్రైవేట్ పాఠశాలలో పన్నెండో తరగతి చదువుతోంది. ఆ పాఠశాలకు చెందిన ఓనర్ తన బంధువులతో కలిసి బాలికను కిడ్నాప్ చేశాడు. ఆపై బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగని కిరాతకులు.. బాలికను చంపేందుకు యత్నించారు. ఈ క్రమంలో బాలిక కళ్లకు తీవ్రంగా గాయపరిచి.. వెన్నెముకను విరిచేశారు. 
 
ప్రస్తుతం బాధిత బాలిక జైపూర్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు నిందితులను ఇంకా పట్టుకోలేదు. కానీ ప్రజలు ఈ దుర్ఘటనపై మండిపడుతున్నారు. నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్త, భర్త వేధిస్తున్నారా...? రండి నావద్దకు, 300 మంది యువతులను...