Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రి పదవికి సురేష్ ప్రభు రాజీనామా.. ఆమోదించని మోడీ.. ఎందుకు?

మానవ తప్పిదం కారణంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన వరుస రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాను ప్రధానమంత్రి

మంత్రి పదవికి సురేష్ ప్రభు రాజీనామా.. ఆమోదించని మోడీ.. ఎందుకు?
, గురువారం, 24 ఆగస్టు 2017 (06:38 IST)
మానవ తప్పిదం కారణంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన వరుస రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమోదించలేదు. 
 
గత నాలుగు రోజుల్లో యూపీలో రెండు రైలు ప్రమాదాలు జరిగాయి. ముజఫర్‌నగర్‌ సమీపంలో గత వారంలో ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పి 23 మంది మరణించగా వంద మందికిపైగా గాయపడ్డారు. ఇది పూర్తిగా మానవతప్పిదంగా తేలింది.
 
ఈ ప్రమాదం మరవకముందే తాజాగా బుధవారం అరియా ప్రాంతంలో కైఫియత్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 70 మందికిపైగా గాయపడ్డారు. ఈ రెండు ఘటనలతో మనస్తాపానికి గురైన సురేశ్‌ ప్రభు.. రాజీనామా చేద్దామని నిర్ణయించుకొని ప్రధాని మోడీని కలిశారు. అయితే మోడీ తొందరపడొద్దని ప్రభుకు సూచించారు. 
 
అయితే ఈ నేపథ్యంలో రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ గతంలో రాజీనామాలు సమర్పించిన రైల్వే మంత్రులు ఉన్నారు. వీరిలో మనకు మొదటగా గుర్తుకు వచ్చేది మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రీనే. 
 
* 1956లో మద్రాసుకు 174 మైళ్ల దూరంలోని ఆరియాల్‌పూర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 152 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే శాఖ మంత్రి లాల్‌బహదూర్‌ శాస్త్రీ తన పదవికి రాజీనామా చేశారు. ఇలా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో ఆయన పరపతి కూడా పెరిగింది. అనంతరం ఆయన్ను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 
 
* నితీశ్‌కుమార్‌ : 1999లో పశ్చిమ్‌బంగలోని గైసల్‌ వద్ద ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 290 మంది మరణించగా.. వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అప్పటి సంకీర్ణ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నితీశ్‌కుమార్‌ రాజీనామా సమర్పించారు. 
 
* మమతా బెనర్జీ : 2000వ సంవత్సరంలో జరిగిన రెండు రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ పదవికి రాజీనామా సమర్పించారు. అయితే అప్పటి ప్రధాని వాజ్‌పేయీ ఆమె రాజీనామాను తిరస్కరించారు. 
 
* ప్రస్తుతం యూపీలో జరిగిన రెండు వరుస ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు రాజీనామాకు సిద్ధ‌ప‌డ్డా .. ప్రధాని మోదీ అంగీకరించలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'డోక్లామ్‌'తో చైనా విలవిల : డ్రాగన్ చేష్టలకు తొణకని బెదరని భారత్