మా దేశ లోక్‌సభ సీట్ల సంఖ్య 546 : యుఎస్ విద్యార్థులతో రాహుల్
భారతదేశ ప్రధానమంత్రి పదవికి సిద్ధమని ప్రకటించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు తడబడ్డారు. దేశ లోక్‌సభ సీట్ల సంఖ్య 546 అంటూ అమెరికాకు చెందిన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ విద్యార్థులతో అన్నార
భారతదేశ ప్రధానమంత్రి పదవికి సిద్ధమని ప్రకటించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు తడబడ్డారు. దేశ లోక్‌సభ సీట్ల సంఖ్య 546 అంటూ అమెరికాకు చెందిన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ విద్యార్థులతో అన్నారు.
ప్రస్తుతం రాహుల్ వారం రోజుల అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ విద్యార్థులతో ఆయన పలు అంశాలపై మాట్లాడుతున్నారు. అలాగే, వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత లోక్‌సభలో సీట్ల సంఖ్య 546 అని చెప్పారు. వాస్తవానికి లోక్‌సభలో రెండు నామినేటెడ్ సీట్లతో కలిపి మొత్తం 545 స్థానాలు ఉంటాయి. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఇంత ముఖ్యమైన విషయం తెలియని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని సెటైర్లు వేస్తున్నారు. రాహుల్ ప్రసంగంలో కనీసం ఒక్క తప్పయినా ఉంటుందని, ఆయన తప్పులేకుండా మాట్లాడలేరంటూ సెటైర్లు వేస్తున్నారు. పైగా, రాహుల్ కూడా ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్‌లా అవుతున్నారంటూ ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.