Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మణిపూర్ ‌నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర

Advertiesment
rahul gandhi

వరుణ్

, ఆదివారం, 14 జనవరి 2024 (14:15 IST)
మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించనున్నారు. పెదేళ్ల మోడీ అన్యాయ్ కాల్ కి వ్యతిరేకంగా ఆయన ఈ యాత్రను చేపట్టారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 11 రోజుల పాటు సాగనుంది. మార్చి 20వ తేదీన ఆయన ఈ యీత్రను మహారాష్ట్రలో ముగిస్తారు. 
 
ఈ యాత్ర మొత్తం 15 రాష్ట్రాలు, 100 లోక్‌సభ స్థానాలు, 110 జిల్లాల మీదుగా సాగుతుంది. 6,700 కిలోమీటర్లు సాగనున్న ఈ యాత్ర మొత్తం 67 రోజులపాటు కొనసాగుతుంది. అలాగే, 337 అసెంబ్లీ నియోజకవర్గాలమీదుగా యాత్ర సాగుతుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ యాత్ర గురించి కాంగ్రెస్ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ పదేళ్ల 'అన్యాయ్ కాల్'కి వ్యతిరేకంగా జరుగుతున్న యాత్రగా దీనిని అభివర్ణించింది. ఈశాన్య రాష్ట్రంలో ప్రారంభమవుతున్న ఈ యాత్ర మార్చి 20న మహారాష్ట్రలో ముగుస్తుంది. 
 
కాగా, రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్‌‌లో కొనసాగుతుంది. రాష్ట్రంలోని 20 జిల్లాల మీదుగా 1,074 కిలోమీటర్లపాటు 11 రోజులపాటు సాగుతుంది. ఝార్ఖండ్‌, అస్సాంలో 8 రోజుల చొప్పున, మధ్యప్రదేశ్‌లో 7 రోజులపాటు యాత్ర కొనసాగుతుంది. 
 
మరీ ముఖ్యంగా రాజకీయంగా అత్యంత ముఖ్యమైన యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలోనూ రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. బీహార్‌లో ఏడు జిల్లాలు, ఝార్ఖండ్‌లో 13 జల్లాలను కవర్ చేసే రాహుల్ యాత్ర ఆయా జిల్లాల్లో వరుసగా 425 కిలోమీటర్లు, 804 కిలోమీటర్లు కొనసాగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పండుగ పూట విషాదం... ముగ్గులు వేస్తుండగా లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు