Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాది ఉడుం పట్టుతో సమానం.. రాహుల్ మార్షల్ ఆర్ట్స్ కుస్తీలు

నిత్యం రాజకీయాలే అనే వారికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఆట విడుపు చర్యలతో ఔరా అనిపిస్తున్నారు. తాను మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ అని ఇటీవలే ప్రకటించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. ఇపుడ

నాది ఉడుం పట్టుతో సమానం.. రాహుల్ మార్షల్ ఆర్ట్స్ కుస్తీలు
, బుధవారం, 1 నవంబరు 2017 (12:59 IST)
నిత్యం రాజకీయాలే అనే వారికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఆట విడుపు చర్యలతో ఔరా అనిపిస్తున్నారు. తాను మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ అని ఇటీవలే ప్రకటించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. ఇపుడు ఆ మాటలను నిజం చేస్తూ కొన్ని ఫొటోలు విడుదల చేసి ఓ ట్విట్ చేశారు. 
 
సాధారణంగా పొలిటికల్ లీడర్స్‌కు క్రీడలపై అవగాహన ఉండదు.. ఎప్పుడూ చూడటమే కానీ ఆటలు ఆడరు అంటూ రాహుల్‌ను ఉద్దేశించి.. ఇటీవల కేంద్ర క్రీడల మంత్రి విజేందర్ సింగ్ చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తనదైనశైలిలో స్పందించారు.
 
"మార్షల్ ఆర్ట్స్‌లోని ఐకిడోలో నేను బ్లాక్ బెల్ట్. దానికోసం నేను చాలా కష్టపడతాను. అయితే పబ్లిసిటీ కోసం మాట్లాడను. నేను రోజూ ఓ గంట స్పోర్ట్స్ కోసం కేటాయిస్తాను. మూడు, నాలుగు నెలలుగా బిజీగా ఉండటం వల్ల సరైన సమయం కేటాయించలేకపోతున్నాను" అంటూ రాహుల్ ఫొటోలతో సహా ట్విట్ చేశాడు. 
 
క్రీడలు అంటే.. రాహుల్ గాంధీకి బిజినెస్ ఈవెంట్స్‌కావని విజేందర్ సింగ్‌కు చురకలు అంటించారు. కరాటే ట్రెడిషినల్ డ్రస్‌లో ఉన్న రాహుల్.. ట్రైనర్ నుంచి మెలకువలు నేర్చుకుంటున్నారు. ప్రాక్టీస్ చేస్తున్నారు. ట్రైనర్‌ను కింద పడేసే ఫొటో కూడా ఉంది. కరాటేలోనే కాకుండా రన్నింగ్, స్విమ్మింగ్ కూడా రోజూ చేస్తానని రాహుల్ అంటున్నాడు.
 
రాహుల్ గాంధీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 47 ఏళ్ల వయస్సులో మంచి పట్టు పడుతున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డస్ట్‌బిన్‌కు పూజలు చేసిన బీహార్ ప్రజలు.. (వీడియో)