Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కావేరి జలాలపై ట్విట్టర్లో.. నటి రమ్య ఏమందో తెలుసా? రైతులకు అండగా ఉంటానంటూ..?

కావేరీ జలాలపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కావేరీ పరీవాహక ప్రాంతాల్లోని రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. తమిళనాడుకు 10 రోజుల్లో 13 టీఎంసీల కావేరి జలాల్ని విడుదల చేయాలని సుప్రీంకోర్టు జారీ చ

కావేరి జలాలపై ట్విట్టర్లో.. నటి రమ్య ఏమందో తెలుసా? రైతులకు అండగా ఉంటానంటూ..?
, సోమవారం, 12 సెప్టెంబరు 2016 (15:58 IST)
కావేరీ జలాలపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కావేరీ పరీవాహక ప్రాంతాల్లోని రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. తమిళనాడుకు 10 రోజుల్లో 13 టీఎంసీల కావేరి జలాల్ని విడుదల చేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో కర్ణాటకలో ఉద్రిక్తత నెలకొంది. మైసూరు, హాసన్, బెంగళూరు గ్రామీణ జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ప్రాంతాల్లో పలు ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. అనేక చోట్ల బంద్‌ వాతావరణం నెలకొంది. 
 
మండ్య జిల్లాలో లోక్‌సభ మాజీ సభ్యురాలు సినీ నటి రమ్య, విధానసభ సభ్యుడు, నటుడు అంబరీష్‌ దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సాగు నీటి మంత్రి పాటిల్‌ నివాసాల ఎదుట ఆందోళనకారులు నిరసన ప్రదర్శనల్ని నిర్వహించారు.
 
కర్ణాటకలోని చామరాజ్‌నగర్‌ జిల్లాలో బంద్‌కు పిలుపునివ్వడంతో సోమవారం మధ్యాహ్నం నుంచే తమిళనాడు బస్సులను నిలిపివేశారు. కన్నడ రైతుల ఆందోళన కారణంగా తమిళనాడు నుంచి కర్ణాటకకు కూరగాయలు, ఇతర సరుకుల సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో కావేరి సమస్యపై రోడ్ల మీదకు వచ్చి పోరాటం  చేస్తే ఫలితం ఉండదని సినీ నటి రమ్య ట్విట్టర్లో తెలిపారు. 
 
కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయడానికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలపై నటి రమ్య మాట్లాడుతూ.. కావేరి సమస్యపై రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తే ఫలితం ఉండదని చెప్పారు. మండ్య జిల్లాలో లోక్‌సభ మాజీ సభ్యురాలు సినీ నటి రమ్య ఆందోళనల్లో పాల్గొనలేదని ఆరోపణలు తలెత్తడంపై.. ఆమె స్పందిస్తూ..  కర్ణాటకలోని రైతులకు తానెప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. 
 
కావేరి నుంచి విడుదలైన జలాలపైనే మాండియా రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం తలెత్తిన జల వివాదానికి కారణం మనమేనా అనే సందిగ్ధంలో ఉన్నాము. దీనికి పరిష్కారమేంటి అనే విషయాన్ని మనకు మనమే ప్రశ్నించుకోవాలి. అంతేకానీ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తే ఫలితం ఉండదని నటి రమ్య వ్యాఖ్యానించారు. 
 
కావేరి నదీజలాల వ్యవహారంలో రెండు రాష్ట్రాల మధ్య రాజుకున్న వివాదంలో తమిళ సినీ పరిశ్రమను తాకింది. తమిళనాడుకు కావేరి నీరివ్వకూడదనే కర్ణాటక సినీ తారల తీరును తమిళ సినీపెద్దలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కళాకారులు భాష, ప్రాంతీయ బేధాలకు అతీతంగా మెలగాలని సీనియర్ దర్శక నిర్మాత గుహనాథన్ సినీ తారలకు పిలుపు నిచ్చారు. 
 
అసలు కావేరి కలహంతో కళాకారులకేం సంబంధమని, కలిసిమెలసి ఉండాల్సిన కళాకారులు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టి విధంగా మాట్లాడటం తగదని ఖండించారు. ఈ రూటులోనే రమ్య కూడా ఫాలో అవుతున్నట్లుంది. సినీ తారగా రోడ్లపై ఆందోళనకు దిగకుండా ట్విట్టర్లో రైతులకు అండగా ఉంటానంటూ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీధి కుక్క కరిచిందనీ తుపాకీతో కాల్చిపారేసిన ఎస్ఐ...