ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని లాల్‌కుర్తి పీఠ్ ప్రాంతంలోని ఒక వస్త్ర దుకాణంలో సుమారు 14 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. వెంటనే షాపు యజమాని రవికుమార్ తన ఉద్యోగులు, కస్టమర్లతో కలిసి దుకాణాన్ని ఖాళీ చేయించి మీరట్ అటవీ శాఖకు సమాచారం అందించారు.
ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ..,తన కస్టమర్లలో ఒకరు దుకాణంలో కొండ చిలువ వుండటాన్ని గుర్తించారని చెప్పాడు. దీంతో అందరూ భయాందోళనకు గురై దుకాణం నుంచి బయటికి వెళ్లిపోయారు. తాము కూడా షాపు బయట వుండి.. అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చాం. దాదాపు గంటన్నర పోరాటం తర్వాత కొండచిలువను అధికారులు పట్టుకున్నారని చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
షాప్‌లోని బట్టల రాక్‌పై కొండచిలువ జారిపోతున్నట్లు వీడియోలో ఉంది. మీరట్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కొండచిలువను రక్షించి సురక్షితంగా తిరిగి దానిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టింది.