Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పంజాబ్‌లో పాగా వేసిన కాంగ్రెస్.. డ్రగ్సే కాదు.. మద్యం ఏరులై పారిందట.. ఈసీ ప్రకటన

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున డ్రగ్స్, మద్యం సరఫరా జరిగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అధికారులు జరిపిన సోదాల్లో 2,598 కిలోల డ్రగ్స్‌తో పాటు రూ.18.26 కోట్ల విలువైన ఇతర మత్తు పదార్థాల

Advertiesment
Punjab Election Result 2017 Live
, శనివారం, 11 మార్చి 2017 (12:30 IST)
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున డ్రగ్స్, మద్యం సరఫరా జరిగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అధికారులు జరిపిన సోదాల్లో 2,598 కిలోల డ్రగ్స్‌తో పాటు రూ.18.26 కోట్ల విలువైన ఇతర మత్తు పదార్థాలు పట్టుబడినట్లు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా తెలిపారు. ఇందులో దాదాపు 164 కేజీల బంగారం, 26.5 కిలోల వెండి పట్టుబడినట్లు వివరించారు.
 
శనివారం సందీప్ సక్సేనా మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్‌తో పాటు రూ.13.34 కోట్ల విలువైన 12.43 లక్షల లీటర్ల మద్యం సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. పోలీసులు, ఇతర అధికారులు జరిపిన సోదాల్లో రూ.58.02 కోట్ల కరెన్సీ నోట్లు కూడా బయటపడ్డాయని తెలిపారు. దీంట్లో రూ.31.68 కోట్లను విచారణ అనంతరం విడుదల చేశామని చెప్పుకొచ్చారు.
 
ఇదిలా ఉంటే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. యూపీ, బీజేపీ, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాలు ముగిసిన వేళ.. పంజాబ్‌లో కాంగ్రెస్ గెలిచింది. పుట్టినరోజు నాడే అటు పార్టీతో పాటు తాను కూడా విజయం సాధించి తన సంతోషాన్ని డబుల్ చేసుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సీఎం అమరీందర్ సింగ్. పంజాబ్‌లో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో పాగా వేసింది. అంచనాలకు మించి రాణిస్తుందనుకున్న ఆప్.. ఆదిలోనే చతికిలపడి గట్టి పోటినివ్వ లేకపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోకల్ బోయ్స్ అడ్రెస్ గల్లంతు... బుద్ధి వచ్చిందా? నేతాజీకి పార్టీ పగ్గాలివ్వు... అఖిలేష్ రాజీనామా