కంప్యూటర్ వైర్‌తో మెడకు ఉరి బిగించి మహిళా టెక్కీ హత్య
మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. ఓ మహిళా టెక్కీని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశారు. కంప్యూటర్ వైర్‌తో మెడకు ఉరి బిగించి హత్య చేసినట్టుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటన ఆదివారం స
మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. ఓ మహిళా టెక్కీని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశారు. కంప్యూటర్ వైర్‌తో మెడకు ఉరి బిగించి హత్య చేసినట్టుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే....
పుణే రాజీవ్ మహాత్మా గాంధీ ఇన్ఫోటెక్ పార్క్ కార్యాలయంలో కేరళకు చెందిన ఆనంద్ కె రాసిలా రాజు (25) అనే మహిళ పని చేస్తూ వస్తోంది. ఇన్ఫోసిస్ భవనం తొమ్మిదో అంతస్తులో విధి నిర్వహణలో ఉన్న ఆమెను ఎవరో గొంతు నులిమి హత్య చేశారు. బెంగళూరులోని ఆమె టీమ్‌తో ఆన్‌లైన్‍లో వర్క్ చేసుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
ఈ కేసులో సెక్యూరిటీ గార్డును ప్రధాన అనుమానితుడిగా పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అందించిన సమాచారం.. రాజు ఆదివారం కార్యాలయంలో పనిచేసుకుంటోంది. ఆమె మేనేజర్ ఆమెకు కాల్ చేసినప్పుడు.. సమాధానం రాకపోవడంతో సెక్యూరిటీ గార్డ్‌ను అలర్ట్ చేశాడు.
అయితే సెక్యూరిటీ గార్డు తనిఖీ చేయగా అపస్మారక స్థితిలో పడి ఉన్నట్టు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో ఆ హత్య జరిగి ఉండొచ్చని అసిస్టెంట్ కమిషనర్ వైశాలి జాదవ్ అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.