తలాక్‌పై తిరగబడిన మహిళ.. ఈ విధానంతో మా జీవితాలు నాశనం.. మోడీకి వినతి
ముస్లిం వివాహ రద్దు చట్టం 'తలాక్'పై ఆ మతానికి చెందిన మహిళలు తిరగబడుతున్నారు. తలాక్ విధానం వల్ల ఎందరో మహిళల జీవితాలు నాశనమైపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అందువల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించ
ముస్లిం వివాహ రద్దు చట్టం 'తలాక్'పై ఆ మతానికి చెందిన మహిళలు తిరగబడుతున్నారు. తలాక్ విధానం వల్ల ఎందరో మహిళల జీవితాలు నాశనమైపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అందువల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ మేరకు 'తలాక్' బాధితురాలు అర్షియా మోడీ సాయం కోరింది. అర్షియాకు పదహారేళ్ళ వయసులో మహ్మద్ కాజిమ్ బగ్వాన్ అనే కూరగాయల వ్యాపారితో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమెకు పద్దెనిమిదేళ్ళు. ఆమెకు ఎనిమిది నెలల కుమారుడు ఉన్నాడు. ఇటీవలే ఆమెకు మహ్మద్ మూడుసార్లు తలాక్ అని రాసిన కాగితాన్ని పంపించి, తన హృదయంలో ఆమెకు స్థానం లేదని, విడాకులు ఇస్తున్నానని పేర్కొన్నాడు.
అయితే ఈ విధంగా విడాకులివ్వడంపై అర్షియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తనవంటి మహిళలకు సహాయం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరుతున్నట్లు తెలిపారు. మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులిచ్చే విధానాన్ని రద్దు చేయాలని, ఇలాంటి సంప్రదాయాలకు కళ్ళెం వేసేందుకు ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని కోరారు. ఈ విధానం వల్ల అసంఖ్యాక మహిళల జీవితాలు నాశనమవుతున్నాయని చెప్పారు. తన భర్త తనకు ఇచ్చిన విడాకులపై కుటుంబ న్యాయస్థానంలో పోరాడతానని చెప్పారు.