Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇందిరమ్మ గుర్తు ఆవు-దూడ, కేరళలో బహిరంగంగా లేగదూడను బలి చేసిందెవరు?

గోవధ నిషేధం రాజకీయ రంగు పులుముకుంటున్నట్లు కనబడుతోంది. గోవులను హిందువులు ఆరాధిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపధ్యంలో దేశంలో కొన్ని రాష్ట్రాలు గోవధపై నిషేధం విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ద

ఇందిరమ్మ గుర్తు ఆవు-దూడ, కేరళలో బహిరంగంగా లేగదూడను బలి చేసిందెవరు?
, సోమవారం, 29 మే 2017 (19:42 IST)
గోవధ నిషేధం రాజకీయ రంగు పులుముకుంటున్నట్లు కనబడుతోంది. గోవులను హిందువులు ఆరాధిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపధ్యంలో దేశంలో కొన్ని రాష్ట్రాలు గోవధపై నిషేధం విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు దానికి వ్యతిరేకం అంటున్నాయి. ఏదెలా వున్నా కేరళలో మాత్రం ఈ వ్యవహారం మరింత వేడిని రగిలిస్తోంది. 
 
బహిరంగంగా అందరూ చూస్తుండగానే గోవును బలి ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాని వెనుక కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు వున్నట్లు ఆరోపణలు రావడంతో వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు తావిచ్చినట్లయింది. దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ తను 1970-80ల్లో పోటీ చేసినప్పుడు ఆవు-దూడ గుర్తును ఎంచుకున్నారు. ఈ గుర్తుపై పోటీ చేసి విజయం కూడా సాధించారు. ఆవు అంటే హిందువులకు పవిత్రమైన చిహ్నం కనుక ఆ విధంగా ఆ గుర్తు అప్పట్లో బాగా వుపయోగపడింది. 
 
ఐతే దురదృష్టవశాత్తూ ఇప్పుడు అదే ఆవు-దూడ వారి చేతిలోనే బలవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐతే కేంద్రం చెపుతున్న గోవధ నిషేధంపై కాంగ్రెస్ పార్టీ చట్టసభల్లో గొంతెత్తి నినదించవచ్చు కానీ ఇలా ఒకరు బహిరంగంగా గోవును వధిస్తుంటే ఏమీ మాట్లాడకుండా చేతులు కట్టుకుని చూస్తుండటం బాధాకరమనే అభిప్రాయాలు వ్యక్తమవడంతో కాంగ్రెస్ పార్టీ ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కేరళ రాష్ట్రంలోని కాన్నుర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేరళ హైకోర్టు సైతం ఘటనకు సంబంధించిన వివరాలపై నివేదిక కోరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీర్పీఎఫ్ జవాన్లు దేశం కోసం చనిపోలేదు.. సైనా, అక్షయ్‌కు మావోల కౌంటర్