Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైలు పట్టాలపై కూర్చొని పబ్ జీ ఆడిన ముగ్గురు మృతి.. ఎక్కడంటే?

railway track

సెల్వి

, శుక్రవారం, 3 జనవరి 2025 (14:04 IST)
బీహార్‌లో రైలు పట్టాలపై కూర్చొని పబ్‌జీ ఆడటంలో నిమగ్నమైన ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. పశ్చిమ చంపారన్ జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరకాతియా గంజ్-ముజఫర్‌పూర్ రైల్వే సెక్షన్‌లోని మాన్సా తోలా ప్రాంతంలోని రాయల్ స్కూల్ సమీపంలో గురువారం ఈ ప్రమాదం జరిగింది.
 
బాధితులు గుమ్టికి చెందిన ఫుర్కాన్ ఆలం, మాన్సా తోలాకు చెందిన సమీర్ ఆలం- బారి తోలాకు చెందిన హబీబుల్లా అన్సారీ ఇయర్‌ఫోన్‌లు ధరించి రైలు వస్తున్నట్లు గుర్తించలేకపోయారు. వేగంగా వస్తున్న రైలు వారిపై నుంచి వెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
 
ఈ ప్రమాదంతో స్థానికులు షాక్ అయ్యారు. రైల్వే ట్రాక్‌లపై మొబైల్ గేమ్‌లు ఆడడం వల్ల కలిగే ప్రమాదాలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల గేమింగ్ అలవాట్లను పర్యవేక్షించాలని పోలీసులు కోరారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాలా చాలా చిన్న కారణం, తనకు విషెస్ చెప్పలేదని ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని