Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాకు ఇంకా ఓపిక ఉంది.. పాక్ పంపితే నా కుమారుడి మృతికి పగ తీర్చుకుంటా : అమర జవాన్ తండ్రి

యురి దాడిలో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కేవలం వారి కుటుంబ సభ్యులే కాదు.. దేశ ప్రజలతో పాటు.. నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

నాకు ఇంకా ఓపిక ఉంది.. పాక్ పంపితే నా కుమారుడి మృతికి పగ తీర్చుకుంటా : అమర జవాన్ తండ్రి
, బుధవారం, 21 సెప్టెంబరు 2016 (13:29 IST)
యురి దాడిలో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కేవలం వారి కుటుంబ సభ్యులే కాదు.. దేశ ప్రజలతో పాటు.. నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.  
 
ఈ దాడిలో వీరమరణం పొందిన హవల్దార్ అశోక్ కుమార్ సింగ్ (44) తండ్రి జగ్ నరైన్ సింగ్ మాట్లాడుతూ.. 'నాకు ఇంకా ఓపిక ఉంది. నా కుమారుడి మృతికి పగ తీర్చుకుంటాను. భారత సైన్యం తరపున నన్ను పాకిస్థాన్‌‌కు పంపండి' అంటూ కేంద్రాన్ని కోరుతున్నాడు. ఈయన తన కొడుకు మరణ వార్త విన్న అనంతరం, తన బాధను దిగమింగుతూ గద్గద స్వరంతో 78 యేళ్ల ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. 
 
జగ్ నరైన్ సింగ్ కుటుంబానికి ఇది రెండో విషాదం. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు కమతా సింగ్ కూడా సైనికుడే. అయితే, 1986లో రాజస్థాన్‌లోని బికనేర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో కమతా సింగ్ వీర మరణం పొందాడు. తాజాగా, రెండో కుమారుడు అశోక్ కుమార్ సింగ్ యూరీ ఘటనలో అసువులు బాశాడు. ఈ విషాదంతో జగ్ నరైన్ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
 
‘ఐదుగురు భారత జవాన్ల మరణానికి ప్రతిగా 10 మంది శత్రువుల తలలు తెగ నరకాలి’ అంటూ జగ్ నరైన్ సింగ్ ఆగ్రహంగా అన్నారు. పదవీ విరమణ అనంతరం స్వగ్రామానికే తిరిగి రావాలని అశోక్ కుమార్ అనుకునేవాడని, యువతను ఆర్మీలో చేర్చేందుకు ప్రోత్సహించేవాడని తన కొడుకు గురించి ఆయన చెప్పారు. 
 
1992లో సైన్యంలో చేరిన అశోక్ కుమార్ దేశ వ్యాప్తంగా చాలా ప్రదేశాలలో పనిచేశాడని, ఇటీవలే పశ్చిమబెంగాల్ లోని భిన్నగురి నుంచి యూరీ సెక్టార్‌కు వచ్చాడని తెలిపారు. సరైన వసతి దొరికిన తర్వాత తన భార్య సంగీతను కూడా తీసుకువెళ్తానని అన్నాడని.. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని ఆ ముదుసలి కన్నీటి పర్యంతమయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌పై ఏ క్షణమైన దాడి చేస్తాం... అదీ మాకు నచ్చిన చోట : పర్వేజ్ ముషారఫ్