Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11000 ఎత్తులో వుండగా ఇండిగో విమానం క్యాబిన్‌లో సమస్య: తృటిలో తప్పిన పెనుప్రమాదం

Advertiesment
11000 ఎత్తులో వుండగా ఇండిగో విమానం క్యాబిన్‌లో సమస్య: తృటిలో తప్పిన పెనుప్రమాదం
, శనివారం, 3 ఏప్రియల్ 2021 (15:01 IST)
ఇండిగో విమానం భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
 
లక్నో నుండి బెంగళూరుకు ఇండిగో విమానం 6E-6654 బయలుదేరింది. ఐతే బెంగళూరుకు 240 కిలోమీటర్ల దూరంలో వుండగా, సుమారు 11 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో విమానం క్యాబిన్లో ఇబ్బంది తలెత్తింది. దీనితో విమానం అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి కోరుతూ ప్రయాణికులకు మే డే ప్రకటించారు.
 
వెంటనే ప్రయాణికులంతా ఆక్సిజన్ మాస్కులు ధరించారు. మరోవైపు బెంగళూరు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విమానం ల్యాండింగ్ కు క్లియరెన్స్ ఇవ్వడంతో పైలెట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీనితో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
 
గత ఏడాది మే నెలలో ఇలాంటి సమస్య పాకిస్తాన్ కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేటపుడు అక్కడ విమానంలో తలెత్తింది. ప్రయాణికులను అప్రమత్తం చేసి ల్యాండ్ అయ్యేందుకు సమాయత్తమయ్యే ఒక్క నిమిషం ముందు విమానం కుప్పకూలి అందులో ప్రయాణిస్తున్న మొత్తం 97 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలోనూ మేడే.. అంటే విమానం ప్రమాదంలో వున్నట్లు తెలిపే సంకేతం తెలియజేసి సేఫ్ గా ల్యాండ్ చేద్దామనుకున్న పైలెట్ల ప్రయత్నం ఫలించలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగ్లాదేశ్‌లో 7 రోజుల పాటు లాక్ డౌన్.. ఎమెర్జెన్సీ సర్వీసులకు మాత్రమే?