Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూపీ జలాల్లో కాంగ్రెస్ చేపలవేట.. ఇదీ ప్లాఫే అంటున్న స్వామి

ఉత్తరప్రదేశ్‌లో ఓటర్లకు తాము ఇది చేశాం అని చూపించుకోడానికి కాంగ్రెస్ వద్ద ఏమీ లేదని, సమాజ్‌వాదీ సాయంతో యూపీ జలాల్లో చేపలవేట మొదలుపెడుతోందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఎద్దేవా చేశారు

యూపీ జలాల్లో కాంగ్రెస్ చేపలవేట.. ఇదీ ప్లాఫే అంటున్న స్వామి
హైదరాబాద్ , మంగళవారం, 24 జనవరి 2017 (02:50 IST)
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు బంధం చెరిగిపోతున్న నేపథ్యంలో రంగప్రవేశం చేసిన ప్రియాంగా గాంధీ అఖిలేష్‌తో నేరుగా మాట్లాడి పొత్తుకు ప్రాతిపదికి ఏర్పర్చిందని మీడియో పేర్కొంటోంది. కానీ ఉత్తర ప్రదేశ్‌కు సంబంధించినంతవరకు కాంగ్రెస్‌ది సర్వవేళలా ప్లాఫ్‌ల చరిత్రేనని బీజేపీ ఎంపీ సుబ్రహణ్య స్వామి ఖరాకండీగా చెబుతున్నారు. పైగా ప్రియాంకా గాంధీ కూడా తన అన్నయ్య రాహుల్ గాంధీ లాగే ఫ్లాప్ అవుతారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి జోస్యం చెప్పారు. 
 
బీజేపీ శిబిరంలో ఉంటూ కాంగ్రెస్ అంటే ఒంటికాలిమీద లేస్తున్న స్వామి ఉత్తరప్రదేశ్‌లో ఓటర్లకు తాము ఇది చేశాం అని చూపించుకోడానికి కాంగ్రెస్ వద్ద ఏమీ లేదని, సమాజ్‌వాదీ సాయంతో యూపీ జలాల్లో చేపలవేట మొదలుపెడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. బీఎస్పీ నుంచి ముస్లిం ఓట్లను లాక్కోవాలన్నది వాళ్ల ప్రయత్నమని అన్నారు. ఇక ప్రియాంకాగాంధీ చేసేది కూడా ఏమీ ఉండబోదని.. అక్కడ ఎన్నికల్లో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవే కీలకంగా వ్యవహరిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గానీ, నెహ్రూ కుటుంబం నుంచి గానీ ఎవరూ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించే అవకాశమే లేదన్నారు. 
 
మొత్తం 403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో బీజేపీ మెజారిటీ సాధిస్తుందన్న నమ్మకాన్ని స్వామి వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి 11 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. సమాజ్‌వాదీ - కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు విషయంలో ప్రియాంకా గాంధీ పాత్ర ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ కూడా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సుబ్రమణ్యం స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.
 
సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకు సంబంధించిన వ్యవహారంలో కూడా రాహుల్ గాంధీ పెద్దగా పాత్ర పోషించని నేపథ్యంలో యూపీలో ప్రచార బాధ్యత కూడా పార్టీ తరపున ప్రియాంక గాంధీనే తీసుకుంటారని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జర్నలిస్టులు నీతిమాలిన సంత అంటున్న ట్రంప్: మీవద్ద నీతులు నేర్చుకోమంటున్న మీడియా