Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీకృష్ణుడి గడ్డపై సరికొత్త ఆకర్షణలు.. ప్రచారంలో అటు ప్రియాంక, ఇటు డింపుల్

తండ్రీ కొడుకుల మధ్య డ్రామాతో కూడిన ఘర్షణ పర్వంలో పార్టీ పరువు గంగలో కలిసిన నేపథ్యంలో కొత్త ఆకర్షణలు లేకుంటే పార్టీని గెలుపు బాట నడిపించడం కష్టమని తేలిపోయింది. దీంతో కాంగ్రెస్ తరపున ప్రియాంకా గాంధీ, ఎస్పీ తరపున అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ప్రధాన

శ్రీకృష్ణుడి గడ్డపై సరికొత్త ఆకర్షణలు.. ప్రచారంలో అటు ప్రియాంక, ఇటు డింపుల్
హైదరాబాద్ , శుక్రవారం, 13 జనవరి 2017 (04:12 IST)
సమాజ్‌వాది పార్టీలో తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ కాస్త తగ్గుముఖం పట్టినట్లు సూచనలు వస్తున్నాయి. సర్వస్వం కోల్పోయానని బహిరంగంగానే ప్రకటించిన ములాయం సింగ్ యాదవ్ నిస్సహాయుడిగా మిగిలిపోగా, సమాజ్ వాదీ పార్టీ జవమూ జీవమూ తానే అయి చక్రం తిప్పే స్థాయికి ఎదిగిన యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వ్యూహానికి కొత్త హంగులు అద్దుతున్నారు. మొదటి నుంచి అఖిలేష్ కాంగ్రెస్‌తో పొత్తు లేకుంటే బలమైన బీజేపీని అడ్డుకోవడం సాధ్యం కాదనే ముందుచూపుతో పావులు కదుపుతూ వచ్చారు. రాహుల్ గాంధీతో స్నేహం పెంచుకున్నారు. 
 
పార్టీలో తన అధికారానికి అడ్డంకులు తొలిగిపోయిన తర్వాత అఖిలేష్ వర్గం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు కోసం కసరత్తు జరుగుతోందని విశ్వసనీయం సమాచారం. త్వరలో అఖిలేశ్, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు పొత్తుపై ప్రకటన చేస్తారని అఖిలేశ్‌ సన్నిహితులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి అఖిలేశ్‌ భార్య, కనౌజ్‌ ఎంపీ డింపుల్‌ యాదవ్, కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తారని అంటున్నారు. 
 
పొత్తు సాకారమైతే ప్రియాంక, డింపుల్‌లు ఎన్నికల్లో ప్రచారం చేసేలా వ్యూహం రూపుదిద్దుకుంటోందని అఖిలేష్ సన్నిహితులో పేర్కొంటున్నారు. తండ్రీ కొడుకుల మధ్య డ్రామాతో కూడిన ఘర్షణ పర్వంలో పార్టీ పరువు గంగలో కలిసిన నేపథ్యంలో కొత్త ఆకర్షణలు లేకుంటే పార్టీని గెలుపు బాట నడిపించడం కష్టమని తేలిపోయింది. దీంతో కాంగ్రెస్ తరపున ప్రియాంకా గాంధీ, ఎస్పీ తరపున అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ప్రధాన ప్రచారాస్త్రాలుగా నిలిచే అవకాశం అనివార్యం అయిపోయింది.  
 
యూపీ ప్రచారం రంగంలో క్రౌడ్ పుల్లర్ల్ ఇప్పుడు ములాయం, సోనియా, రాహుల్, అఖిలేష్ కాదు. అటు ప్రియాంక, ఇటు డింపుల్. వీరి రాకతో యూపీ రాజకీయాలు రసకందాయంలో పడనున్నాయని పరిశీలకుల వ్యాఖ్య.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిజర్వాయర్లలో దొంగలు పడ్డారు. ఎవరు, ఎక్కడ?