Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ ఎమ్మెల్యే నచ్చకపోతే దించేయొచ్చు! ఎలా?

ఒక్కసారి గెలిస్తే ఐదేళ్లు ఢోకా లేదు. ఎంజాయ్.. హ్యాపీ. పనులు చేసినా.. చేయకపోయినా అడిగే నాథుడే లేడు. అడిగినా చేస్తే చేస్తాం.. లేకపోతే లేదు. ఇప్పుడైతే ఫుల్ ఖుషీ. ఎప్పుడో ఓసారి నియోజకవర్గానికి వెళ్లి అలా

మీ ఎమ్మెల్యే నచ్చకపోతే దించేయొచ్చు! ఎలా?
, శుక్రవారం, 3 మార్చి 2017 (11:56 IST)
ఒక్కసారి గెలిస్తే ఐదేళ్లు ఢోకా లేదు. ఎంజాయ్.. హ్యాపీ. పనులు చేసినా.. చేయకపోయినా అడిగే నాథుడే లేడు. అడిగినా చేస్తే చేస్తాం.. లేకపోతే లేదు. ఇప్పుడైతే ఫుల్ ఖుషీ. ఎప్పుడో ఓసారి నియోజకవర్గానికి వెళ్లి అలా కనిపించి వస్తే సరి.. మళ్లీ జనంతో అవసరం వచ్చేది ఐదేళ్లకు కదా.. అప్పుడు చూసుకోవచ్చు.. ఎన్నికల్లో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు అనుకునేది ఇలాగే. నియోజకవర్గం అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రజాప్రతినిధులకు త్వరలోనే షాక్ తగలనుందా.. రీకాల్ ఆఫ్షన్ దిశగా కేంద్రం ఆలోచిస్తుందా.. ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
 
ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు సరిగా పని చేయకపోతే.. వారిని రీకాల్ చేసే అధికారం ఓటేసిన ప్రజలకు ఉండాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అంటున్నారు. దీనిపై లోక్‌సభలో ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. నియోజకవర్గాల్లో పనిచేయని ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ఓటర్లకే ఇవ్వాలనేది ఆయన డిమాండ్. 
 
ఇందులో భాగంగానే పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ 1951 చట్టానికి 2016లో పార్లమెంట్ సభ్యులు సవరణలు ప్రతిపాదించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం రైట్ టు రీకాల్‌ను ఓ ప్రైవేట్ బిల్‌గా పెట్టబోతున్నట్టు ప్రకటించారు. రీకాల్ ఎలా చేస్తారంటే.. ఈ బిల్ చట్టంగా మారితే.. సంబంధిత ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఓటరుగా నమోదైన వ్యక్తి.. డైరెక్టుగా స్పీకర్‌కు పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. 
 
ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టాలని ఎలక్షన్ కమిషన్‌కు సూచిస్తారు స్పీకర్. విచారణలో పిటీషన్ వ్యక్తి చెప్పిన విషయాలు వాస్తవం అని నిర్ధారణ అయితే.. ఎన్నికల సంఘం సంబంధిత ఎమ్మెల్యేపై రీకాల్ ఓటింగ్ నిర్వహిస్తుంది. అందులో 75 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేస్తే.. అతని పదవి ఊడిపోవడం ఖాయం. ఈ బిల్ సామాన్యుడికి దక్కనున్న బ్రాహ్మాస్త్రం అంటున్నారు నిపుణులు. రైట్ టు రీకాల్ బిల్ చట్టం అయితే.. ఎన్నికైన ఎమ్మెల్యే రెండేళ్లలోపే పదవి కోల్పోయినా ఆశ్చర్యం లేదు. అందలం ఎక్కించిన ఓటరు.. అగాథంలోకి నెట్టే అధికారం కూడా ఇస్తారా.. లేదో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేన ఎన్నికల్లో దిగితే ఎన్ని స్థానాలు గెలుస్తుందో తెలుసా..!