ఏపీలో కాంగ్రెస్‌కు మరోమారు ఘోర పరాభవం... మీరా కుమార్‌కు '0' ఓట్లు
తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టారు. ఈ ఓట్ల లెక్కింపులో భాగంగా పార్లమెంట్ హౌస్‌లో పోలైన ఓట్లతో పాటు.. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్, అసొం, బీహార్‌లతో కలుపుకుని మొత్తం 11 రాష్ట
తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టారు. ఈ ఓట్ల లెక్కింపులో భాగంగా పార్లమెంట్ హౌస్‌లో పోలైన ఓట్లతో పాటు.. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్, అసొం, బీహార్‌లతో కలుపుకుని మొత్తం 11 రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు వేసిన ఓట్ల లెక్కింపు పూర్తయింది.
ఇందులో ఎన్డీయే అభ్యర్థి రాంనాథ్ కోవింద్‌కు 60,683 ఓట్లు రాగా, ఆయనకు పోటీగా యూపీఏ తరపున పోటీ చేసిన మీరా కుమార్‌కు 22,941 ఓట్లు లభించాయి. అయితే, ఏపీలో రాంనాథ్‌కు మొత్తం 27189 ఓట్లు రాగా, మీరా కుమార్‌కు ఒక్క ఓటు కూడా దక్కలేదు. అంటే కాంగ్రెస్‌కు మరోమారు ఘోర పరాభవం ఎదురైంది. దీనికి కారణం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎంపీ లేదా ఎమ్మెల్యే లేకపోవడమే.
కాగా, ఇప్పటివరకు పార్లమెంట్‌తో పాటు 11 రాష్ట్రాల్లో పోలైన ఓట్లను లెక్కించగా, ఎన్డీయే అభ్యర్థి రాంనాథ్‌కు 1389 ఓట్లు పోలయ్యాయి. వీటి విలువ 4,79,585గా ఉంది. అలాగే, యూపీఏ అభ్యర్థి మీరా కుమార్‌కు 576 ఓట్లు పోలయ్యాయి. వీటి విలువ 2,04,594గా ఉంది.