Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్యాన్స్ చేయనని చెప్పిన పాపానికి ప్రెగ్నెంట్ డ్యాన్సర్‌ను కాల్చేశాడు

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఓ వైపు దేశవ్యాప్తంగా దారుణాలు.. అఘాయిత్యాలు పెరిగిపోతున్న తరుణంలో తనతో కలిసి డ్యాన్స్ చేయనని చెప్పిన పాపానికి ఓ డ్యాన్సర్‌ను అత్యంత దారుణంగా కాల్చిచంపేసిన ఘట

Advertiesment
Pregnant dancer killed at a marriage in Bathinda
, ఆదివారం, 4 డిశెంబరు 2016 (17:30 IST)
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఓ వైపు దేశవ్యాప్తంగా దారుణాలు.. అఘాయిత్యాలు పెరిగిపోతున్న తరుణంలో తనతో కలిసి డ్యాన్స్ చేయనని చెప్పిన పాపానికి ఓ డ్యాన్సర్‌ను అత్యంత దారుణంగా కాల్చిచంపేసిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని భటిండాలో ఓ డ్యాన్సర్‌ను ఓ దుండగుడు పొట్టనబెట్టుకున్నాడు. 
 
ఇదంతా ఓ వివాహ కార్యక్రమంలో చోటుచేసుకుంది. ఓ వివాహ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టేజ్ డ్యాన్స్‌లో మహిళా డ్యాన్సర్లు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రోగ్రామ్‌ను చూస్తుండిన ఓ మద్యం తాగిన వ్యక్తి మత్తులో డ్యాన్స్ గర్ల్స్‌పై కన్నేశాడు. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తనతో డ్యాన్స్ చేయాల్సిందిగా ఓ డ్యాన్సర్‌ను కోరాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు వందలాదిమంది చూస్తుండగా తపంచాతో ఆమెపై కాల్పులు జరిపాడు.
 
దీంతో డ్యాన్స్ చేస్తున్న ఆమె ఒక్కసారిగా స్టేజిపై కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో తెలియని మిగతా డ్యాన్సర్లు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అప్పటి వరకు ఉత్సాహంగా సాగిన పెళ్లి కార్యక్రమం ఈ ఘటనతో భయానకంగా మారిపోయింది. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డ్యాన్సర్ ప్రాణాలు కోల్పోయింది. ఇంకా కాల్పుల్లో మరణించిన డ్యాన్సర్ గర్భంగా ఉన్నట్లు తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం.. అమెరికాకు నవాజ్ షరీఫ్.. 18 లేదా 19 తేదీల్లో?