స్నేహితుడి సలహా మేరకు మర్మాంగాన్ని కోసుకున్నాడు ఓ యువకుడు. వైద్యులను సంప్రదించకుండా ఈ పని చేసిన ఆ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు పోటీపరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు.
అయితే అతడికి అమ్మాయిల ఫీలింగ్స్ ఉండటంతో అమ్మాయిగా మారాలని భావించాడు. స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకు మత్తు ఇంజక్షన్ తీసుకుని మర్మాంగాన్ని కట్ చేసుకోమని సలహా చెప్పాడు. అతడు చెప్పినట్లుగా యువకుడు మత్తు ఇంజక్షన్ తీసుకుని మర్మాంగాన్ని కోసుకున్నాడు.
మత్తు ప్రభావంలో ముందుగా నొప్పి తెలియకపోయినా క్రమంగా మత్తుదిగినాకొద్ది నొప్పి మొదలైంది. నొప్పి తట్టుకోలేక ఆస్పత్రి పాలయ్యాడు. వెంటనే వైద్యులు అతడికి చికిత్స చేశారు. రక్తస్రావం ఆగిపోయిందని అతడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు.