కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వయోవందన యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇది పూర్తిగా 60 ఏళ్ల వయసు పైబడిన వారికి వర్తిస్తుంది. ఈ పథకం భారత జీవిత బీమా సంస్థ ఆధ్వర్వంలో నడుస్తుంది. దీని ద్వారా పెన్షన్ రూపంలో ప్రతి వయోవృద్ధుడిని ఆదుకుంటుంది.
ఈ పథకము 2020 మే 26 నుండి 2023 మార్చి 31 వరకూ అమలులో వుంటుంది. దీని నిర్ణీత కాలపరిమితి 10 సంవత్సరాలు. దీని ద్వారా ప్రతి చందాదారుడు కనీసం రూ. 1000 నుండి రూ. 10 వేల వరకూ పొందే అవకాశం వుంది. ఒకవేళ తన కుటుంబ సభ్యుడు ఎవరైనా ప్రమాదవశాత్తూ మరణించినా చెల్లించిన దాని నుండి 90 శాతం రుణాన్ని తిరిగి పొందే అవకాశం వుంది.
ఒకవేళ చందాదారుడు మరణించినట్లయితే పెన్షన్ రూపంలో తను పేర్కొన్న నామినీకి ఆ డబ్బు అందించబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రదానమంత్రి వయో వందన యోజనలో చూడవచ్చు. ఈ సౌకర్యాన్ని 60 ఏళ్లు పైబడినవారు వినియోగించుకోవాలని ఎల్ఐసి తెలియజేసింది.