బండి ఆపి తాళం లాక్కునే అధికారం ఏ పోలీస్ అధికారికీ లేదు...
విజయవాడ:- మీరు వాహనంపై దర్జాగా వెళుతుంటారు. అకస్మాత్తుగా ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు అడ్డొస్తారు. మీరు బండి ఆపే లోపే వాళ్ళు బండి తాళాలు లాక్కుంటారు. లైసెన్స్, బండి కాగితాలున్నాయా? చూపించు అంటూ హైరానా పెట్టేస్తారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనలో చ
విజయవాడ: మీరు వాహనంపై దర్జాగా వెళుతుంటారు. అకస్మాత్తుగా ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు అడ్డొస్తారు. మీరు బండి ఆపే లోపే వాళ్ళు బండి తాళాలు లాక్కుంటారు. లైసెన్స్, బండి కాగితాలున్నాయా? చూపించు అంటూ హైరానా పెట్టేస్తారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురవుతుంది. సిగ్నల్స్ వద్ద, చెకింగ్ పాయింట్స్ వద్ద పోలీస్ కానిస్టేబుల్స్ వాహనాలను ఆపిందే తడవుగా మన బండికున్న తాళాన్ని లాక్కుంటుంటారు. ఆ తర్వాతే మన దగ్గరున్న లైసెన్స్, ఇతర ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తారు. అయితే అలా బండి తాళాన్ని లాక్కునే అధికారం పోలీస్ కానిస్టేబుల్‌కే కాదు, ఏ ఇతర పోలీస్ అధికారికి కూడా లేదని రవాణా శాఖ స్పష్టం చేసింది.
హర్యానాలోని సిర్ఫా ప్రాంతానికి చెందిన పవన్ పారిఖ్ అనే లాయర్ ఇలా బైక్ కీ లాక్కునే హక్కు పోలీసు కానిస్టేబుల్‌కి ఉందా, అని ఆర్‌టీఏని ప్రశ్నించాడు. దానిపై స్పందించిన రాష్ట్ర హోం శాఖ ‘అలా కీ తీసుకొనే హక్కు కానిస్టేబుల్‌కే కాదు, ఏ పోలీసు అధికారికి లేదు’ అని తెలిపింది. పోలీసులకి ఈ విషయం తెలియక వారు అలా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. పవన్ కూడా ఇలాంటిదే అనుభవమైనందున సూటిగా రవాణా శాఖను ప్రశ్నించాడు.
వాస్తవానికి ఇది చాలామందికి అనుభవమే. బండి ఆపకముందే తాళాన్ని లాక్కుంటారు, బండి కాగితాలు చూపించేదాక కూడా వెయిట్ చేయరంటూ గతంలో కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ మీద చాలా అభియోగాలొచ్చాయి, అంతేకాదు అర్హతతో సంబంధం లేకుండా ఎవరుపడితే వారు రశీదు పుస్తకాన్ని చేత పట్టి ఫైన్‌లు వేసిన రోజులు కూడా గతంలో అనేకం ఉన్నాయి.
* బండిని ఆపి తాళం లాక్కునే అధికారం ఏ పోలీస్ అధికారికీ లేదు.
* ఏ పోలీస్ అధికారికి ఫైన్‌ను బై హ్యాండ్‌గా చెల్లించాల్సిన అవసరం లేదు.
* లైసెన్స్ లేని పరిస్థితిలో లైసెన్స్ నెంబర్ చెప్పినా చాలు
* ఎస్సై పైస్థాయి వ్యక్తులు తప్ప ఇతర అధికారులు చలానా వేయడానికి అర్హులు కారు.