ములాయం సింగ్ కుటుంబ కూకటి వేళ్లను పీకేసిన నరేంద్ర మోడీ...
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అగ్రనేత ములాయంసింగ్ యాదవ్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైంది. సకుటుంబ సపరివార సమేతంగా ఎస్పీ తరపున పోటీచేసిన ఆయన బంధుగణమంతా భాజపా జెండా రెపరెపలకు ఎగిరిపోయారు.
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అగ్రనేత ములాయంసింగ్ యాదవ్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైంది. సకుటుంబ సపరివార సమేతంగా ఎస్పీ తరపున పోటీచేసిన ఆయన బంధుగణమంతా భాజపా జెండా రెపరెపలకు ఎగిరిపోయారు. మల్లయోధుడు పుట్టి పెరిగిన ‘ఇటావా’ జిల్లాలో ఒక్కసీటు కూడా ఎస్పీ గెలుచుకోలేక పోయింది. అయితే, ఒక్క ఒక్క శివపాల్‌యాదవ్ మాత్రం గుడ్డిలో మెల్లగా గెలుపుతీరాలకు చేరుకున్నారు.
ముఖ్యంగా, గత 18 ఏళ్లుగా లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కనౌజ్‌లో ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే నామమాత్రపు మెజార్టీతో దక్కించుకోగలిగారు. లఖ్‌నౌ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసిన రెండో కోడలు అపర్ణాయాదవ్‌ను గెలిపించాలని పెద్దకోడలు డింపుల్‌తో కలసి ప్రచారం చేసినా ఓటర్లు కనికరంచూపలేదు.
'నేను గెలిచి చూపిస్తా అంటూ' బరిలోకి దిగిన స్వాతిసింగ్ (భాజపా) దూకుడుకు ఆయన మేనల్లుడు అనురాగ్‌యాదవ్ ఓడిపోవడాన్ని అడ్డుకోలేకపోయారు. ములాయం సొంతజిల్లా ఇటావాలో సమాజ్‌వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఇక్కడి మొత్తం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటీ ఆ పార్టీ గెలవలేకపోయింది. ఐదుకు ఐదుస్థానాల్లోనూ భాజపా అభ్యర్థులే విజయబావుటా ఎగురవేశారు.