Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అహంకారంతో పెద్ద నోట్లను రద్దు చేయలేదు.. నల్లకుబేరుల్ని వదిలిపెట్టేది లేదు: మోడీ

గోవాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి అంతం చేయమని ప్రజలు తనకు అధికారం ఇచ్చారని.. అలాంటి వారికే తన జీవితం అంకితమని.. ప్రజల కోసమే జీవిస్తానని, ప్రజల కోసమే మరణిస్తానని ప్రధానమం

అహంకారంతో పెద్ద నోట్లను రద్దు చేయలేదు.. నల్లకుబేరుల్ని వదిలిపెట్టేది లేదు: మోడీ
, ఆదివారం, 13 నవంబరు 2016 (14:20 IST)
గోవాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి అంతం చేయమని ప్రజలు తనకు అధికారం ఇచ్చారని.. అలాంటి వారికే తన జీవితం అంకితమని.. ప్రజల కోసమే జీవిస్తానని, ప్రజల కోసమే మరణిస్తానని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉద్ఘాటించారు. ఆదివారం గోవాలోని మోపాలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన అనంతరం మోడీ మాట్లాడుతూ.. నోట్ల రద్దు నిర్ణయానికి బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్‌ చేస్తున్నానన్నారు.
 
పెళ్లిళ్లు, ఇతర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయినా తన నిర్ణయాన్ని ప్రజలంతా అంగీకరిస్తున్నారని మోడీ హర్షం వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో సామాన్య, పేద ప్రజలకు లాభమేనని, నల్లధనం యుద్ధం చేయమన్నారు. ఇప్పుడు యుద్ధం చేస్తుంటే ఇబ్బంది పడుతున్నారని మోడీ వ్యాఖ్యానించారు. 
 
నల్లధనం వెనక్కి తీసుకురావడంపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని, పన్ను చెల్లించేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మోడీ స్పష్టం చేశారు. ఈ  విషయంలో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ప్రధాని ఫైర్ అవుతున్నారు. అవినీతి, నల్లధనం నిర్మూలన కోసమేనని, అందుకే పెద్ద నోట్లను రద్దు చేసినట్లు మోడీ వెల్లడించారు.  
 
బినామీ ఆస్తులు ఉన్న వాళ్ల మీద కూడా దాడులు చేయనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. భారత్ నుంచి బయటకు వెళ్లిన సంపదను, తిరిగి తీసుకువస్తామన్నారు. నల్లకుబేరులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలి పెట్టబోమని హెచ్చరించారు. నల్లధనంపై ప్రాణంపోయినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రజలంతా హాయిగా నిద్రపోయారని, కొంతమంది మాత్రం నిద్రపోలేకపోయారని వ్యాఖ్యానించారు.
 
అవినీతికి వ్యతిరేకంగా 2014లో తమకు ప్రజలు ఓటు వేశారని చెప్పారు. నిజాయితీపరుల కోసం కీలక అడుగులు వేస్తున్నామన్నారు. తన​కు పదవీ వ్యామోహం లేదని, అహంకారంతో పెద్ద నోట్లను రద్దు చేయలేదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖలో ఒడిస్సా తరహా ఘటన.. నాలుగేళ్ల బిడ్డ శవాన్ని చేతులో పెట్టుకుని 3 కిలోమీటర్లు..?