Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

కేవీఐసీ క్యాలెండర్‌లో మోడీ బొమ్మ.. గాంధీజీ జాతిపిత, మరి నరేంద్ర మోడీ??? మమత ప్రశ్న

పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికే ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనేనని గుర్రుగా ఉంటే.. మోడీని మరో వివాదం చుట్టుముట్టింది. కేలండర్ మీద బొమ్మ వివాదాంశంగా మారింది. ఖాదీ, గ్

Advertiesment
PM Narendra Modi
, శుక్రవారం, 13 జనవరి 2017 (16:08 IST)
పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికే ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనేనని గుర్రుగా ఉంటే.. మోడీని మరో వివాదం చుట్టుముట్టింది. కేలండర్ మీద బొమ్మ వివాదాంశంగా మారింది. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) ముద్రించిన 2017వ సంవత్సరం కేలండర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చరఖా తిప్పుతున్న బొమ్మను ముద్రించడంతో వివాదం మొదలైంది. 
 
ఈ ఫోటోలో చరఖా తిప్పుతున్న వద్ద మహాత్మా గాంధీని తప్పించి, మోడీ ఆ స్థానాన్ని ఆక్రమించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవీఐసీ ముద్రించిన కేలండర్, డైరీల్లో ఈ చిత్రం ప్రముఖంగా కనిపిస్తోంది. దీంతో కేవీఐసీలో కొందరు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా మోదీపై విమర్శలు గుప్పించారు. మహనీయమైన చిహ్నం చరఖా, మహాత్మా గాంధీల స్థానాన్ని మోడీ ఆక్రమించేశారు. గాంధీజీ జాతిపిత, మరి మోదీ??? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేశారు. 
 
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ ట్వీట్‌లో మోడీపై విరుచుకుపడ్డారు. గాంధీజీగా మారాలంటే అనేక సంవత్సరాలపాటు నియమనిష్ఠలతో జీవించాలని, చరఖాతో ఫోజు ఇచ్చినంత మాత్రానికి ఆయనలా మారిపోవడం కష్టమన్నారు. 
 
కేవీఐసీ చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ కేవీఐసీ కేలండర్లు, డైరీల్లో మహాత్మా గాంధీ బొమ్మ లేకపోవడం ఇదే మొదటిసారి కాదన్నారు. 2013, 2015, 2016 సంవత్సరాల కేలండర్లు, డైరీల్లో గాంధీజీ బొమ్మ లేదన్నారు. గాంధీజీ బొమ్మ ఉండటం తప్పనిసరి అని తెలిపే నిబంధనలేవీ లేవని తెలిపారు. ఖాదీకి గాంధీజీ అతి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు. జాతిపిత స్థానం ఎప్పటికీ పదిలంగానే ఉంటుందన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ సైనికులను చంపేశాం.. హఫీజ్ :: ఉత్తుత్తిదేనన్న భారత్