Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నల్లకుబేరులను ప్రభుత్వం ఉరితీయదు.. కానీ 30 తర్వాత చుక్కలే : ప్రధాని మోడీ హెచ్చరిక

దేశంలోని నల్లకుబేరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టి హెచ్చరిక చేశారు. డిసెంబర్ 30వ తేదీ తర్వాత నల్లకుబేరులకు పగటిపూటే చుక్కలు కనిపిస్తాయని అన్నారు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న అవినీతి, నల్లధనంపై త

నల్లకుబేరులను ప్రభుత్వం ఉరితీయదు.. కానీ 30 తర్వాత చుక్కలే : ప్రధాని మోడీ హెచ్చరిక
, ఆదివారం, 25 డిశెంబరు 2016 (10:53 IST)
దేశంలోని నల్లకుబేరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టి హెచ్చరిక చేశారు. డిసెంబర్ 30వ తేదీ తర్వాత నల్లకుబేరులకు పగటిపూటే చుక్కలు కనిపిస్తాయని అన్నారు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న అవినీతి, నల్లధనంపై తమ ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం ఇప్పట్లే ఆగదన్నారు. గెలుపు సాధించేదాకా ఈ సమరం ఆగదని స్పష్టం చేశారు. 
 
పూణె, ముంబైలలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ... ‘డిసెంబరు 30’ తర్వాత అవినీతిపరులు, అక్రమార్కుల పతనం తథ్యమని హెచ్చరించారు. నల్లకుబేరులు దారికి రావాల్సిందేనని స్పష్టంచేశారు. ఇప్పటికైనా వాళ్లు ఈ దేశ చట్టాలను గౌరవించాలని పిలుపునిచ్చారు. ‘‘అక్రమార్కులను ఉరి తీయాలని, కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం భావించడంలేదు. కానీ, పేదలకు మాత్రం మేలు జరగాల్సిందే. వారి నుంచి లాక్కున్నది తిరిగి ఇచ్చేయండి. ఇంకా వారికి సమయం ఉంది. ఈ దేశ చట్టాలను గౌరవించండి. హాయిగా నిద్రపోండి’’ అని నల్ల కుబేరులకు పిలుపునిచ్చారు.
 
‘‘మీకు నేనంటే భయంలేకపోవచ్చు. చట్టాలంటే భయం లేకపోవచ్చు. 125 కోట్ల మంది ప్రజలంటే మాత్రం మీరు భయపడాల్సిందే. వారిని తక్కువ అంచనా వేయవద్దు. అవినీతిని, నల్లధనాన్ని భరించేందుకు వాళ్లు సిద్ధంగాలేరు’’ అని తేల్చిచెప్పారు. ఇప్పుడున్నది పాత ప్రభుత్వం కాదని గుర్తుచేశారు. ‘‘తప్పించుకోవడానికి ఏదో ఒక దారి ఉంటుందనుకుంటే మీరు పొరబడినట్లే. కొందరు బ్యాంకుల్లో డబ్బులు వేసుకుని... ఆ తర్వాత దానిని తెలుపు చేసుకుందామనుకుంటున్నారు. ఆ డబ్బు తెలుపు కాదు. కానీ, వారి ముఖాలు మాత్రం నల్లబడటం ఖాయమన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెట్రోల్ బంకుల్లో మొబైల్ పేమెంట్లు వద్దు.. పేలితో బాధ్యత ఎవరు?