Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌ను ఏం చేద్ధాం... మీరు దేనికైనా సిద్ధమా? త్రివిధ దళాధిపతులో ప్రధాని మోడీ భేటీ!

పాకిస్థాన్‌ను ఏం చేద్ధాం. మీరు దేనికైనా సిద్ధమా..? అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులను ప్రశ్నించారు. యూరీ ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ పీవోకేలో సర్జికల్ దాడులు జరిపింది. ఈ దాడుల నేపథ్యంలో

Advertiesment
పాకిస్థాన్‌ను ఏం చేద్ధాం... మీరు దేనికైనా సిద్ధమా? త్రివిధ దళాధిపతులో ప్రధాని మోడీ భేటీ!
, బుధవారం, 9 నవంబరు 2016 (09:32 IST)
పాకిస్థాన్‌ను ఏం చేద్ధాం. మీరు దేనికైనా సిద్ధమా..? అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులను ప్రశ్నించారు. యూరీ ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ పీవోకేలో సర్జికల్ దాడులు జరిపింది. ఈ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో... సరిహద్దు వద్ద పాకిస్థాన్ హద్దు మీరుతోంది. 
 
ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోజీ త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో సరిహద్దు వద్ద భద్రతకు తీసుకుంటున్న చర్యలను ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ ప్రధానికి వివరించారు. పాకిస్థాన్ వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై చర్చించారు. పాక్ కాల్పుల్లో వరుసబెట్టి భారత జవాన్లు చనిపోతున్న తరుణంలో జవాన్ల మరణాలను తగ్గించే విషయంపై చర్చించారు. పాక్ బలగాలు భారత పౌరులు, జనావాసాలు టార్గెట్ చేసుకోవడంపైన కూడా చర్చించారు. 
 
ఈ క్రమంలో పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు త్రివిధ దళాల సన్నద్ధత గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. పాకిస్థాన్‌ కాల్పులను ధీటుగా తిప్పికొట్టే విషయంలో, తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు గతంలోనే భారత ఆర్మీకి ప్రధాని మోడీ సర్కారు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి దూసుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు మెరుపుదాడులు నిర్వహించింది. మొదలు పాకిస్థాన్ వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. ఇప్పటివరకూ 120 సార్లు ఉల్లంఘించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నల్లధనానికి చెక్.. నల్ల కుబేరులపై సర్జికల్ స్ట్రైక్స్... మోడీకి ప్రశంసల వెల్లువ..