భారత రాష్ట్రపతిగా ఎల్కే.అద్వానీ?... సన్నిహితుల వద్ద మోడీ ప్రస్తావన!
భారత తదుపరి రాష్ట్రపతిగా లాల్‌కృష్ణ అద్వానీ నియమితులు కానున్నారా? దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమనుకుంటున్నారు? ఈ విషయంపై ఇపుడు సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.
భారత తదుపరి రాష్ట్రపతిగా లాల్‌కృష్ణ అద్వానీ నియమితులు కానున్నారా? దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమనుకుంటున్నారు? ఈ విషయంపై ఇపుడు సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.
గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌లో జరిగిన బీజేపీ సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపినట్లు సమాచారం. ఈ సమావేశానికి అద్వానీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేశూభాయ్ పటేల్ కూడా హాజరయ్యారట. రాష్ట్రపతి పదవిని గురు దక్షిణగా సమర్పిస్తానని ప్రధాని మోడీ చెప్పినట్లు వినికిడి.
ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ఈ ఏడాది జూలై 25తో ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ శాసనసభల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. గోవా, మణిపూర్‌లలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. దీంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరుగుతుంది. ఫలితంగా రాష్ట్రపతిగా తనకు నచ్చిన నేతను గెలిపించుకోగలిగే సామర్థ్యం ఆ పార్టీకి లభించనుంది.
దీంతో ప్రణబ్ ముఖర్జీ స్థానంలో అద్వానీని ఎంపిక చేసి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. ముఖ్యంగా.. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ నేతలకు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయిందనే అపవాదు ఉంది. దీన్ని పోగొట్టుకునే విధంగా అద్వానీని రాష్ట్రపతిగా ఎంపిక చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.