Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్జికల్ స్ట్రైక్స్ కాదు.. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నాం... మీ సలహా ఏంటి?

మంగళవారం సాయంత్రం 4 గంటలకు త్రివిధ దళాధిపతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి అత్యవసర ఫోన్ కాల్ వెళ్లింది. అత్యవసర సమావేశం ఉంది.. తక్షణం రావాలన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. ఆ తర్వాత 4.30 గంటలకు

Advertiesment
PM Modi
, గురువారం, 10 నవంబరు 2016 (10:08 IST)
మంగళవారం సాయంత్రం 4 గంటలకు త్రివిధ దళాధిపతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి అత్యవసర ఫోన్ కాల్ వెళ్లింది. అత్యవసర సమావేశం ఉంది.. తక్షణం రావాలన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. ఆ తర్వాత 4.30 గంటలకు త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. 
 
ఈ భేటీకి హాజరైన దళాధిపతులతో పాటు జాతీయ భద్రతా సలహాదారుడు మనసులోని ఆలోచన ఒకటే. మరో సర్జికల్స్ స్ట్రయిక్స్ చేయాలన్న ఆలోచనలో ఉన్న మోడీ, అందుకు సలహా, సూచనలు అడుగుతారని భావించారు. లేకుంటే పాకిస్థాన్‌కు సంబంధించిన మరో విషయాన్ని చర్చించేందుకు పిలిచారని అనుకున్నారు.
 
కానీ, వాళ్ళకు ప్రధాని చెప్పిన విషయం ఒక్కటే. "నేటి రాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నాం. శాంతిభద్రతల సమస్య తలెత్తితే దాన్ని నివారించేందుకు మీ సహకారం తప్పనిసరి. అందుకే ఈ సమావేశం. ఇక మీ సలహాలివ్వండి" అని అడిగారట. ఆపై పావుగంటకు సదరు మీటింగ్ అయిపోవడం, ఆపై మోడీ మీడియా సమావేశం గురించి పత్రికలు, ప్రసార మాధ్యమాలకు సమాచారం వెళ్లడం జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యేక వార్డుకు జయలలిత.. మరికొద్ది రోజులు 15 రోజలు ఆస్పత్రిలోనే...