Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయ్యా సీఎంలూ... కేసీఆర్‌ను చూసి నేర్చుకోండయ్యా.. టి సర్కారుకు మోడీ అభినందనలు

ఇటీవల ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఇందులో పలు రాష్ట్రాలుకు చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోడీతో పాటు నీతి ఆయోగ్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర

అయ్యా సీఎంలూ... కేసీఆర్‌ను చూసి నేర్చుకోండయ్యా.. టి సర్కారుకు మోడీ అభినందనలు
, బుధవారం, 26 ఏప్రియల్ 2017 (13:29 IST)
ఇటీవల ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఇందులో పలు రాష్ట్రాలుకు చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోడీతో పాటు నీతి ఆయోగ్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సర్కారు పనితీరుని ప్రత్యేకంగా మెచ్చుకున్నారట. 
 
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును తొలుత ఆమోదించిన తెలంగాణను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ సూచన చేశారట. అంతేనా, రైతుల విషయంలో కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న విధానం మంచిదని ఆయన ప్రశంసించినట్టు సమాచారం. జీఎస్టీ బిల్లు తొలి దశలోనూ తెలంగాణ ఇదే చొరవను ప్రదర్శించిందన్నారు. పలు రాష్ట్రాల సీఎంలు కూడా రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల ధోరణిని కనబరిచారు. 
 
అంతేకాకుండా, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉచిత ఎరువుల పథకాన్ని నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌ చంద్‌ కూడా ప్రశంసించారు. రుణమాఫీతో పోలిస్తే ఇది మంచి నిర్ణయమన్నారు. రుణమాఫీ ఇవ్వాలనుకుంటున్న రాష్ట్రాలు తెలంగాణ తరహాలో ఎరువులు ఇవ్వడం, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టడం మంచిదన్నారు. ముఖ్యంగా కరవు పీడిత ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు అభినందనీయమన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

37 యేళ్ల ఐపీఎస్ సర్వీస్.. సంపాదన 3 గదుల ఇల్లు… 2 ఎకరాల పొలం… దటీజ్ యూపీ డీజీపీ నిజాయితీ