Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనా సరిహద్దుల్లో సైనికులతో కలిసి ప్రధాని మోడీ దీపావళి సంబరాలు

Advertiesment
modi diwali celebrations
, ఆదివారం, 12 నవంబరు 2023 (16:42 IST)
దేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి సంబరాలు ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా సరిహద్దుల్లో భారత సైనికులతో కలిసి దీపావళి సంబరాలను జరుపుకున్నారు. సైనిక దుస్తులను ధరించిన ఆయన.. మాటామంతి నిర్వహించారు. 2014 నుంచి ప్రతి దీపావళిని సైనికులతో కలిసి ప్రధాని మోడీ జరుపుకుంటున్న విషయం తెల్సిందే.
 
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లెప్చా ఏరియాలో సైనికులను కలిసి మాట్లాడిన ఫోటోలను ఆయన ట్వీట్ చేశారు. చైనా సరిహద్దుల సమీపంలోని ఉన్న ఈ ఏరియా అత్యంత కీలకమైన ప్రదేశం. ఆదివారం ఉదయమే ప్రధాని మోడీ ఇక్కడికి చేరుకున్నారు. ఆర్మీ యూనిఫాం ధరించి సైనికులు, అధికారులతో కలిపోయారు. దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
webdunia
 
2014లో ప్రధానంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోడీ దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకుంటున్నారు ఏటా ఏదో ఒక సరిహద్దు ప్రాంతానికి ప్రధాని మోడీ వెళ్లి దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకుంటున్న విషయం తెల్సిందే. సరిహద్దులను కాపాడుకునేందుకు కుటుంబానికి దూరంగా ఉంటున్న వారితో పండుగను సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంటుందన్నారు. 

నిర్భాగ్యులకే ఆప్ఘనిస్థాన్ కెప్టెన్ గుర్బాజ్ దీపావళి గిఫ్ట్... ఏంటది?  
 
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్లలో ఆప్ఘనిస్థాన్ ఒకటి. మైదానంలో తమ ఆట తీరుతో కోట్లాది మంది క్రికెట్ అభిమానులను సొంతం చేసుకుంది. అంతేనా.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక వంటి జట్లను చిత్తు చేసి సంచలనం సృష్టించింది. అలాంటి జట్టు కెప్టెన్‌గా రహ్మనుల్లా గుర్బాజ్. ఈ టోర్నీ నుంచి స్వదేశానికి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఆయన.. అహ్మదాబాద్‌లో తన పెద్ద మనసును చాటుకున్నారు. 
 
అహ్మదాబాద్ వీధుల్లో ఫుట్‌పాత్‌‍లపై దయనీయంగా బతుకుబండి లాగించే నిర్భాగ్యులకు ఆర్థిక సాయం చేశాడు. అది కూడా వారు నిద్రిస్తుండగా, వారికి తెలియకుండా వారి పక్కన కొంత డబ్బు ఉంచాడు. వారు ఆ డబ్బుతో దీపావళి వేడుకలు చేసుకోవాలన్నది గుర్బాజ్ కోరిక. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుర్బాజ్ మంచి మనసును నెటిజన్లు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. 
 
గుర్బాజ్ దాతృత్వంపై న్యూజిలాండ్ యువ సంచలనం రచిన రవీంద్ర కూడా స్పందించారు. "ఈ ఆప్ఘాన్ అబ్బాయిల మనసు నిజంగానే స్వచ్ఛమైన బంగారం అని అభివర్ణించారు. వారు ఎంతో దయగల క్రికెటర్లు. వారు భారత్‌లో ఇంతమంది అభిమానం పొందుతుండటంలో ఆశ్చర్యమేమీ లేదు. భారత్‌లో వారు మైదానంలోనూ, వెలుపల అందరి హృదయాలను గెలుస్తున్నారు" అంటూ ట్వీట్ చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాహితతో ప్రేమాయణం... మందలించిన కుటుంబ సభ్యులు... కత్తితో దాడిచేసిన ప్రియురాలు