Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

Advertiesment
modi  - rapal kashyap

ఠాగూర్

, మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (08:44 IST)
నరంద్ర మోడీ ప్రధాని అయ్యేంత వరకు, ఆయనను ప్రత్యక్షంగా చూసేవరకు పాదరక్షలు ధరించనని 14 యేళ్లుగా శపథం చేసి, దీక్ష చేసిన తన వీరాభిమానిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా కలుసుకున్నారు. ఆ తర్వాత ఆయనకు స్వయంగా పాదరక్షకలు తొడిగి, దీక్ష విరమించేలా చేశారు. హర్యానా రాష్ట్రంలోని కైథాల్‌కు చెందిన రాంపాల్ కశ్యప్‌తో యమునా నగర్‌లో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. రాంపాల్‌కు స్వయంగా పాదరక్షలు తొడిగారు. ఎవరూ కూడా ఇలాంటి ప్రతిజ్ఞతలు వద్దని, సామాజిక సేవపై దృష్టసారించాలని ప్రధాని మోడీ సూచించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హర్యానా రాష్ట్రంలోని కైథాల్‌ నివాసి అయిన రాంపాల్ కశ్యప్‌ వినూత్న ప్రతిజ్ఞ చేశారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేంతవరకు, ఆయనను తాను ప్రత్యక్షంగా చూసేంతవరకు పాదరక్షలు ధరించబోనని 14 యేళ్ల క్రితం శపథం చేశారు. ఆ అభిమానిని సోమవారం యమునానగర్‌లో ప్రధాని స్వయంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు పాదరక్షలు తొడిగి సుధీర్ఘ ప్రతిజ్ఞకు ముగింపు పలికారు. 
 
ప్రధాని మోడీ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, "నేను ఇపుడు మీకు పాదరక్షలు తొడుగుతున్నాను. కానీ, భవిష్యత్‌లో ఇలాంటి పనులు ఎపుడూ చేయవద్దు. మీరు పని చేసుకోవాలి. ఇలా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం ఎందుకు అని సూచించారు. కాగా ప్రధానిని కలవడం పట్ల రాంపాల్ కశ్యప్ ఆనదం వ్యక్తం చేశారు. 
 
ఈ భేటీ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందిస్తూ, ఈ రోజు యమునా నగర్ బహిరంగ సభలో కైథాల్‌కు చెందిన శ్రీ రాంపాల్ కశ్యప్‌ను కలిశాను. నేను ప్రధాని అయ్యాక, నన్ను కలిసిన తర్వాత పాదరక్షలు ధరిస్తానని ఆయన 14 యేళఅల క్రితం ప్రతిజ్ఞ చేశారు. రాంపాల్ వంటి వారి పట్ల నేను వినమ్రుడను. వారి అభిమానాన్ని స్వీకరిస్తాను. కానీ, ఇలాంటి ప్రతిజ్ఞలు చేసే వారందరినీ కోరుతున్నాను. మీ ప్రేమను నేను గౌరవిస్తాను. దయచేసి సామాజిక సేవ, దేశ నిర్మాణానికి సంబంధించిన పనులపై దృష్టిపెట్టండి" అని మోడీ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?