Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతులకు గుడ్ న్యూస్: 2022 ఆగస్ట్ 31లోగా ఇకేవైసీ చేయొచ్చు

Advertiesment
Farmers
, మంగళవారం, 16 ఆగస్టు 2022 (15:01 IST)
కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన రైతులకు ప్రతీ ఏటా రూ.6,000 పెట్టుబడి సాయం లభిస్తుంది. రూ.2,000 చొప్పున మూడు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఏటా రూ.6,000 జమ చేస్తోంది. 
 
ఇప్పటివరకు 11 ఇన్‌స్టాల్‌మెంట్స్ జమ అయ్యాయి. ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్య 12వ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల కానుంది. రైతులు ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేస్తే 12వ ఇన్‌స్టాల్‌మెంట్ పొందొచ్చు.
 
తాజాగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలోని రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ ఇకేవైసీ గడువు జూలై 31న ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఇకేవైసీ చేయాలనుకునే రైతులకు అవకాశం లేకుండా పోయింది. త్వరలో 12వ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల కానుందన్న సంగతి తెలిసిందే.  
 
ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయని రైతులకు మరో అవకాశం లభించింది. పీఎం కిసాన్ ఇకేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం 2022 ఆగస్ట్ 31 వరకు పెంచింది. దీంతో రైతులు ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయడానికి మరో 15 రోజుల గడువు లభించినట్టైంది.
 
పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు పొందాలంటే రైతులు ఇకేవైసీ చేయించడం తప్పనిసరి. ఇప్పటివరకు కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయని రైతులు 2022 ఆగస్ట్ 31లోగా ఇకేవైసీ చేయొచ్చు. 
 
పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్రాసెస్ సులువే. పీఎం కిసాన్ పోర్టల్‌లో ఓటీపీ బేస్డ్ ఇకేవైసీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. లేదా రైతులు దగ్గర్లోని సీఎస్‌సీ సెంటర్లకు వెళ్లి బయోమెట్రిక్ బేస్డ్ ఇకైవైసీ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. 
 
పీఎం కిసాన్ ఇకేవైసీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే
రైతులు ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో eKYC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
ఆధార్ కార్డ్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
ఆధార్ కార్డుకు లింకైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత Get OTP ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి.
ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టిన ఎయిర్‌టెల్