ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పనిసరిగా ఈ నెలాఖరులోగా ఈకేవైసీని చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో బోగస్ పేర్లను లబ్ధిదారులుగా నమోదు చేసుకుని గత సీజన్లలో నిధులను కాజేసిన వైనాన్ని కేంద్రం గుర్తించగా.. ఈ సీజన్‌లో అర్హులను గుర్తించేందుకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది.
కాగా గడువు ఈ నెల 31 వరకే ముగుస్తున్నా జిల్లాలో ఈకేవైసీ నామమాత్రంగా సాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 10 శాతం మాత్రమే నమోదైంది.
ఈకేవైసీని పూర్తి చేసిన రైతులకు మాత్రమే ప్రస్తుతం రూ.2 వేల చొప్పున చెల్లింపులు చేయాలని లేదా నమోదు పూర్తికాకుంటే ఈ సీజన్ నుంచి నిధులను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.