అమ్మకు రెండు కాళ్లు పనిచేయలేదా? మెర్సీ కిల్లింగ్ కోరుకున్నారా? శశీ నన్ను చంపేయ్ అన్నారా?
అపోలోలో 75 రోజుల పాటు చికిత్స పొందుతూ.. గుండెపోటుతో మరణించిన దివంగత సీఎం జయలలితపై మలేషియా పత్రిక ఆసక్తికర కథనం ప్రచురించింది. తనను మెర్సీ కిల్లింగ్ చేయమని స్వయంగా జయలలిత నెచ్చెలి శశికళను కోరినట్లు ఆ ప
అపోలోలో 75 రోజుల పాటు చికిత్స పొందుతూ.. గుండెపోటుతో మరణించిన దివంగత సీఎం జయలలితపై మలేషియా పత్రిక ఆసక్తికర కథనం ప్రచురించింది. తనను మెర్సీ కిల్లింగ్ చేయమని స్వయంగా జయలలిత నెచ్చెలి శశికళను కోరినట్లు ఆ పత్రిక ఊటంకించింది. డయాబెటిస్ కారణంగా జయలలిత కాళ్లు రెండూ పనిచేయలేకుండా పోయాయని, దీంతో మనస్తాపానికి గురైన జయలలిత.. కాళ్లు లేకుండా జీవించలేనని.. తనను చంపేయాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు ఆ పత్రిక తెలిపింది.
గత సెప్టెంబర్ 22వ తేదీ తమిళనాడు దివంగత సీఎం జయలలిత అనారోగ్యం కారణంగా చెన్నై అపోలోలో చేరి.. డిసెంబర్ 6న అర్థరాత్రి 11.30 గంటలకు గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో జయలలిత మరణంలో సస్పెన్స్ ఉందని అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ పుష్ప.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత మరణం పట్ల పలు అనుమానాలున్నాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇంకా అమ్మ మరణంపై మిస్టరీ వీడాలని విజ్ఞప్తి చేశారు.
అయితే జయలలిత కాళ్లు పనిచేయలేకుండా పోయాయని.. అందుకే శశికళతో తనను చంపేయాలని జయలలిత కోరుకున్నట్లు మలేషియా పత్రిక తెలిపింది. 17-12-16న ప్రచురితమైన పత్రికలో అమ్మ కాళ్లు లేక జీవించలేనని, మెర్సీ కిల్లింగ్ చేయమని శశికళను వేడుకున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. ఈ పత్రిక ప్రచురించిన కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.