Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ అనుభవాన్ని మళ్ళీ వాడతానంటున్న ప్రియాంకా...

కాంగ్రెస్ పార్టీలో కుటుంబ రాజకీయాల గురించి తెలిసిందే. రాజీవ్ గాంధీ మరణం తరువాత ఆ బాధ్యతలు మొత్తాన్ని మోసిన సోనియాగాంధీ ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదులుకున్నారు. కేవలం పార్టీని అధ్యక్షు

Advertiesment
ఆ అనుభవాన్ని మళ్ళీ వాడతానంటున్న ప్రియాంకా...
, ఆదివారం, 20 ఆగస్టు 2017 (14:43 IST)
కాంగ్రెస్ పార్టీలో కుటుంబ రాజకీయాల గురించి తెలిసిందే. రాజీవ్ గాంధీ మరణం తరువాత ఆ బాధ్యతలు మొత్తాన్ని మోసిన సోనియాగాంధీ ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదులుకున్నారు. కేవలం పార్టీని అధ్యక్షురాలిగా, ప్రభుత్వాన్ని తన కనుసన్నల్లోనే నడిపిస్తూ వచ్చారు. ఎన్నో యేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా తుడుచుకుపోవడానికి యువరక్తమే కారణమన్నది అందరికీ తెలిసిందే. యువరక్తమంటే రాహుల్ గాంధీ. 
 
కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది రాజకీయ ఉద్దండులు ఉంటే వారి సలహాలు, సూచనలు తీసుకోకుండా ఇష్టమొచ్చినట్లు రాహుల్ గాంధీ నిర్ణయాలు తీసేసుకోవడం వల్ల పార్టీ మనుగడే ప్రశ్నార్థకరంగా మారింది. ఇది అందరకి తెలిసిందే. స్నేహం.. స్నేహం అని కొంతమందితో కలిసి చివరకు అభాసుపాలయ్యారు రాహుల్ గాంధీ. కొడుకు ఏం చేసినా పట్టించుకోని తల్లి సోనియా గాంధీ వల్లే పార్టీ పరిస్థితి ఇలా తగలబడిందని చెప్పే కాంగ్రెస్ పార్టీ నేతలు లేకపోలేదు.
 
ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఉద్దరించాల్సింది ఒక్క ప్రియాంక గాంధీనే. ప్రియాంకకు అస్సలు రాజకీయాలంటే ఇష్టం లేదు. ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ చేసిన ప్రియాంక గాంధీ అందరిలాగానే వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో హాయిగా ఉంటోంది. ప్రియాంక భర్త రాబర్ట్ మాత్రం రాజకీయాల్లో ఎప్పుడూ తలదూరుస్తూనే ఉంటారు. ఇప్పటికీ ఎన్నో ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న దిక్కు ప్రస్తుతం ప్రియాంక ఒక్కరే.
 
ఎందుకంటే పార్టీకి కొత్త రక్తం కావాలి. అందులోనూ మహిళలాంటి వ్యక్తి అయితే ఇంకా మంచింది. ఇందిరాగాంధీ పోలికలు దగ్గరగా ఉండే ప్రియాంక గాంధీ అంటే అందరూ అభిమానిస్తారు. ఆమె ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్‌వైభవం వస్తుందనేది పార్టీ నేతల ఆలోచన. అందుకే పార్టీ అధినేత్రితో పాటు రాహుల్ గాంధీని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది పార్టీ సీనియర్ నేతలు. అయితే ప్రియాంక గాంధీకి ఏ మాత్రం ఇష్టం లేదు. గత కొన్నిరోజుల నుంచి పార్టీ నేతలతో పాటు భర్త రాబర్ట్ నుంచి కూడా ప్రియాంకకు ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి ప్రచార కర్త అయిపోవాలన్న ఆలోచనలో ఉన్నారు.
 
గతంలోనే ప్రియాంక కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రచారాలు కూడా.. ఆమెకు అందులో అనుభవం కూడా ఉంది. ఆ అనుభవనాన్ని కొన్నిరోజుల పాటు తిరిగి వాడితే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ప్రాణం పోసినట్లు అవుతుందనేది పార్టీ నేతల ఆలోచన. అదే పనిని ప్రియాంక చేయబోతోందట. ప్రియాంక గాంధీ రంగంలోకి దిగితే కాంగ్రెస్ పార్టీకి పునర్‌వైభవం వస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ - చైనా యుద్ధం తప్పదా? సైనికుల కొట్లాట (Video)