Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తరాది అహంకారం అని ఊరికే అన్నానా.. ఇదే మరి... పవన్ ట్వీటాగ్రహం..!

నల్లగా ఉండే దక్షిణ భారతీయులతో మేం కలిసి ఉండట్లేదా' అన్న బీజేపీ ఎంపీ తరుణ్‌ విజయ్‌ వికృత వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ఇలాంటి వివక్షలే జాతిని గీతలు గీసి మరీ విడదీస్తాయని పవన్ ఆగ్ర

Advertiesment
ఉత్తరాది అహంకారం అని ఊరికే అన్నానా.. ఇదే మరి... పవన్ ట్వీటాగ్రహం..!
హైదరాబాద్ , శనివారం, 8 ఏప్రియల్ 2017 (01:58 IST)
నల్లగా ఉండే దక్షిణ భారతీయులతో మేం కలిసి ఉండట్లేదా' అన్న బీజేపీ ఎంపీ తరుణ్‌ విజయ్‌ వికృత వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ఇలాంటి వివక్షలే జాతిని గీతలు గీసి మరీ విడదీస్తాయని పవన్ ఆగ్రహించారు. బీజేపీ ఎంపీ తరుణ్ నల్ల వ్యాఖ్యలపై శుక్రవారం రాత్రి పవన్ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.
 
నల్లగా ఉన్నందుకు కోకిలను నిషేధించండి. మీరు ఎగురవేసే జాతీయ పతాకం ఒక దక్షిణాది మహనీయుడి రూపకల్పనే. క్షమాపణలు చెప్పినంత మాత్రాన మేం మర్చిపోయే అవమానం కాదిది అంటూ పపన్ ట్వీటాగ్రహం ప్రకటించారు. దక్షిణ భారతీయుల చెల్లించే రెవెన్యూకు ప్రతిగా వారికి మీరేం చేస్తున్నారు అని పవన్ ఈ సందర్బంగా బీజేపీ ఎంపీని నిలదీశారు. 
 
ఉత్తరాది అహంకారం మొత్తం మీ మాటల్లో కనిపిస్తోంది. నల్లగా ఉన్నందుకు కోకిలను నిషేధించండి. మీలాంటి వాళ్లు ప్రదర్శించే వివక్షలే జాతిని మరింతగా విడదీస్తాయని పవన్ మండిపడ్డారు. భారతీయులను జాత్యహంకారులు కారని, నల్లవాడైన కృష్ణుడిని పూజిస్తారని, జాతివివక్ష ఉంటే గనుక నల్లగా ఉండే దక్షిణ భారతీయులతో కలిసి ఎలా నివసిస్తామని తరుణ్ అన్నారు. ఇద్దరు నైజీరియా విద్యార్థులపై నోయిడాలో జరిగిన దాడిపై 'ఆల్ జజీరా' చానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ తరుణ్‌ విజయ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
భారతీయులను జాత్యహంకారులు అనడం దుర్మార్గం. ఎందుకంటే మేము నల్లవాడైన కృష్ణుడిని పూజిస్తాం. మాకే కనుక జాతివివక్ష ఉంటే దక్షిణ భారతీయులతో కలిసి ఎలా నివసిస్తాం. మాలోనూ, మన చుట్టూ నల్లజాతీయులు ఉన్నారు. వివిధ వర్గాలకు చెందినప్పటికీ భారతీయులు పరస్పరం సంఘర్షించుకుంటారు. కొంతకాలం క్రితం మహారాష్ట్రలో బిహారీలపై దాడులు జరిగాయి. మరాఠీలను బిహార్ లో బెదిరించారు. ఇవన్నీ జాత్యహంకార దాడులు కాద'ని తరుణ్ విజయ్‌ పేర్కొన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శిశకళ కోసం ఆర్కే నగర్‌లో విజయశాంతి ఎన్నికల పర్యటన