Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా కర్మకాకపోతే... ఓటేసి ఎమ్మెల్యేల్ని ఎన్నుకుంటే.. చిన్నమ్మకు సపోర్ట్ చేస్తారా? చిన్నమ్మ చికెన్ పీస్‌కు?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత ఆమె విధేయుడు ఓపీఎస్ పార్టీని నడిపిస్తాడని, ఆయనే సీఎంగా తమిళనాడు రాష్ట్రాన్ని నడిపిస్తాడని అందరూ అనుకున్నారు. అందుకే చిన్నమ్మ శశికళను కూడా ఆయన వ్యతిరేకించారు.

మా కర్మకాకపోతే... ఓటేసి ఎమ్మెల్యేల్ని ఎన్నుకుంటే.. చిన్నమ్మకు సపోర్ట్ చేస్తారా? చిన్నమ్మ చికెన్ పీస్‌కు?
, గురువారం, 16 ఫిబ్రవరి 2017 (12:26 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత ఆమె విధేయుడు ఓపీఎస్ పార్టీని నడిపిస్తాడని, ఆయనే సీఎంగా తమిళనాడు రాష్ట్రాన్ని నడిపిస్తాడని అందరూ అనుకున్నారు. అందుకే చిన్నమ్మ శశికళను కూడా ఆయన వ్యతిరేకించారు. ఆమె అమ్మకు తోడుగా ఉంటూ ఆమె మరణంపై అనుమానాలు సృష్టించిందని... తనతో బెదిరించి సీఎం పదవికి రాజీనామా చేసిందని నిజం చెప్పినా.. ఎమ్మెల్యేలు డబ్బులకు బానిసై రెసార్ట్స్‌లో తాగి డ్యాన్సులేశారు. ఎమ్మెల్యేలకు ఫుడ్, ఫూటుగా మందు ఏర్పాటు చేయడంతో చిన్నమ్మ వెంట కుక్కల్లా తిరిగారని ప్రజలు విమర్శిస్తున్నారు. 
 
అమ్మ మరణంలో ఏదో మర్మం ఉందని.. అందుకు శశికళే కారణమని బహిరంగంగా ఆమె విధేయుడే చెప్పినా.. చిన్నమ్మ వేసిన చికెన్ ముక్క కోసం ఎమ్మెల్యేలు ఆమె ప్రతిపాదించిన పళని సామికి వంత పాడటం సరికాదని తమిళ ప్రజలు ఫైర్ అవుతున్నారు. అమ్మకు ఓటేసి తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే.. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోకుండా చిన్నమ్మ నిర్ణయాలకు కట్టుబడి వుండటం ఎంతవరకు సబబు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
 
చిన్నమ్మకు సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలకు ప్రజల్లో వ్యతిరేకత తప్పదని.. నియోజకవర్గాల్లో తిరిగితే నిరసన తప్పదని ప్రజలు అంటున్నారు. పన్నీర్ సెల్వం పార్టీకోసం ఎంత త్యాగాలు చేసినా.. ఆయన్ని వెలివేయడం ఏంటని.. చిన్నమ్మ మొహం చూసి తాము ఓటేయలేదని.. వచ్చే ఎన్నికల్లో చిన్నమ్మకు కాదు.. అమ్మ లేని అన్నాడీఎంకే పార్టీకి ప్రజలు చుక్కలు చూపిస్తారని రాజకీయ పండితులు కూడా జోస్యం చెప్తున్నారు. 
 
ఇప్పటికే చిన్నమ్మ చిప్పకూడు తింటుంటే.. గోల్డెన్ బే రెసార్ట్‌లో ఆమె వేసిన ఎంగిలి మెతుకులు తిన్న ఎమ్మెల్యేలతోనే అన్నాడీఎంకే పార్టీ తప్పకుండా గంగలో కలిసిపోతుందని సోషల్ మీడియాలో ప్రజలు ఆవేశంతో రగిలిపోతున్నారు. ఇదే ఎమ్మెల్యేలు పన్నీర్ వెంట నిలబడి.. అమ్మ పార్టీ కోసం ఆశయాలకోసం పనిచేసివుంటే తప్పకుండా ఆ పార్టీకి జీవం ఉండేదని... అమ్మ కలను చిన్నమ్మ వెంటపడిన శునకాలైన ఎమ్మెల్యేలే గంగలో కలుపుతున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో జరిగిన సర్వేలో చిన్నమ్మకు ఎంత మద్దతు లభించిందో.. పన్నీరుకు ఎంత లభించిందో తెలుసుకోని ఎమ్మెల్యేలు.. ప్రజా సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపడుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 
 
అయితే డబ్బు, అధికారం, బెదిరింపులకు ఎమ్మెల్యేలు తలొగ్గితే.. ప్రజాప్రతినిధులని వారికి పేరెందుకు అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రేపు పళనిసామి సీఎం అయినా.. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని.. తద్వారీ డీఎంకే లాభపడక తప్పదని రాజకీయ పండితులు కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ పన్నీరు దీపతో కలిసి కొత్త పార్టీ పెడితే.. మాత్రం ఆయనకు మద్దతు లభిస్తుందని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక నేనొక మాజీ సీఎం... ప్రజాసేవ చేసుకుంటూ బతుకుతా... పన్నీర్ సెల్వం