Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో 10 మంది ఐఎస్ఐ ఉద్యోగులు: పాక్‌కు వెళ్తూ బాంబు పేల్చిన అఖ్తర్

ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో 10 మంది ఐఎస్ఐకి చెందిన ఉద్యోగులు పని చేస్తున్నారని దేశ బహిష్కరణకు గురైన దౌత్యాధికారి మహమూద్ అఖ్తర్ తన కుటుంబ సభ్యులతో స్వదేశానికి వెళ్తూవెళ్తూ బాంబు పేల్చాడు.

Advertiesment
ఢిల్లీలో 10 మంది ఐఎస్ఐ ఉద్యోగులు: పాక్‌కు వెళ్తూ బాంబు పేల్చిన అఖ్తర్
, ఆదివారం, 30 అక్టోబరు 2016 (09:35 IST)
ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో 10 మంది ఐఎస్ఐకి చెందిన ఉద్యోగులు పని చేస్తున్నారని దేశ బహిష్కరణకు గురైన దౌత్యాధికారి మహమూద్ అఖ్తర్ తన కుటుంబ సభ్యులతో స్వదేశానికి వెళ్తూవెళ్తూ బాంబు పేల్చాడు. దౌత్యపరమైన రక్షణ ఉంటుందన్న ఏకైక కారణంతోనే వీరాంతా ఇక్కడ పని చేస్తున్నారని తెలిపారు. 
 
సైన్యానికి చెందిన రహస్య పత్రాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై అఖ్తర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత అతని వద్ద జరిపిన విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ తరపున 10 మంది ఢిల్లీలో వివిధ స్థాయుల్లో పని చేస్తున్నట్టు ఆయన వెల్లడించినట్టు సమాచారం. 
 
కాగా, పాకిస్థాన్ దేశ బహిష్కరణకు గురైన భారత దౌత్యాధికారి సూర్జీత్ సింగ్‌ త‌మ‌ దేశంలో ఉండడానికి వీలులేని వ్యక్తిగా పాక్‌ ప్రకటించింది. దీంతో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి పాక్ విడిచారు. ఈ విష‌యాన్ని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఈ నెల 27న ఆయ‌న‌ను 48 గంటల్లోగా పాకిస్థాన్‌ విడిచిపెట్టాల్సిందిగా ఆదేశించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూఢచర్యం కేసులో సమాజ్‌వాదీ ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి అరెస్టు