Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్ ఔట్ పోస్టులపై విరుచుకుపడిన భారత సైన్యం... 20 మంది పాక్ జవాన్లు హతం!

కవ్వింపు చర్యలతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పాకిస్థాన్ సైన్యానికి భారత సైన్యం తగిన గుణపాఠం నేర్పారు. ఇండో-పాక్ నియంత్రణ రేఖ వెంబడి... జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కుప్వారా జిల్లాలోని కెరన్‌ సెక్టా

Advertiesment
Pakistan
, ఆదివారం, 30 అక్టోబరు 2016 (08:57 IST)
కవ్వింపు చర్యలతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పాకిస్థాన్ సైన్యానికి భారత సైన్యం తగిన గుణపాఠం నేర్పారు. ఇండో-పాక్ నియంత్రణ రేఖ వెంబడి... జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కుప్వారా జిల్లాలోని కెరన్‌ సెక్టార్‌లో పాక్‌ సైన్యానికి చెందిన నాలుగు ఔట్‌పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ దాడిలో దాదాపు 20 మందికిపైగా మృత్యువాతపడినట్టు భారత ఆర్మీ ప్రకటించింది.
 
దీనిపై భారత ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ నిరంతరం కవ్వింపు చర్యలతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాం. తీవ్ర స్థాయిలో ఎదురు దాడికి దిగాం. పాక్‌ పోస్టులు నాలుగు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అటువైపు భారీగానే ప్రాణనష్టం సంభవించింది అని చెప్పుకొచ్చారు. ఇంతకు మించి వివరాలు బయటపెట్టలేదు. 
 
భారత సైనికుల ఎదురుదాడిలో 20 మందిదాకా పాక్‌ జవాన్లు మరణించినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత ఎక్కువగా కూడా ఉండొచ్చని చెబుతున్నారు. కాశ్మీర్‌లోని మచిలీ సెక్టార్‌లో ఉగ్రవాదులు భారత జవానును అతి కిరాతకంగా చంపిన సంగతి తెలిసిందే. పాక్‌ జవాన్లు కాల్పులు జరుపుతూ ఉగ్రవాదులకు సహకరించారు. దీనికి తగిన విధంగా బదులిస్తాం... అని ఆర్మీ ప్రకటించిన 24 గంటల్లోనే కెరన్‌ సెక్టార్‌లో పాక్‌కు భారీ ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికల ముంగిట హిల్లరీకి షాక్‌... ఈ-మెయిల్స్‌ స్కాంలో మళ్లీ దర్యాప్తు