Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌కు బుద్ధి చెపుదాం... ప్రతిదాడికి వ్యూహ రచన చేయండి.. భారత ఆర్మీకి ఆదేశాలు

భారత జవాను మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి సరిహద్దుల్లో పారేసిన పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని భారత ఆర్మీ భావిస్తోంది. ఇందుకోసం ఆర్మీని సర్వసన్నద్ధం చేస్తోంది. ఈ మేరకు.. భారీ దాడి వ్యూహానికి రంగ

పాకిస్థాన్‌కు బుద్ధి చెపుదాం... ప్రతిదాడికి వ్యూహ రచన చేయండి.. భారత ఆర్మీకి ఆదేశాలు
, బుధవారం, 23 నవంబరు 2016 (10:53 IST)
భారత జవాను మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి సరిహద్దుల్లో పారేసిన పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని భారత ఆర్మీ భావిస్తోంది. ఇందుకోసం ఆర్మీని సర్వసన్నద్ధం చేస్తోంది. ఈ మేరకు.. భారీ దాడి వ్యూహానికి రంగం సిద్ధం చేయాలని ఆర్మీని రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
కాశ్మీర్‌లోని మచ్చల్‌ సెక్టర్‌లో నియంత్రణ రేఖ వెంబడి మంగళవారం సాయంత్రం పాక్‌ దళాలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాయి. పాక్‌ సైనికులు, ఆర్మీ మద్దతు ఇచ్చే ఉగ్రవాదులతో కూడి ఉండే బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌ (బ్యాట్‌) ఈ కాల్పులకు తెగబడింది.
 
ఈ కాల్పుల్లో ముగ్గురు భారత సైనికులు అమరులయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని పాక్‌ సైనికులు స్వాధీనం చేసుకున్నారు. దానిని ముక్కముక్కలుగా ఛిద్రం చేసి మరీ భారత సరిహద్దుల్లో వదిలేశారు. పాక్‌ దళాలు భారత భూభాగంలోకి అడుగుపెట్టి.. మన జవాన్లను తీవ్ర చిత్రహింసలు పెట్టి, వారి శరీరాలను ఛిద్రం చేయడం అనేది నెలలో ఇది రెండోసారి. 
 
పాక్‌ దళాల వికృతత్వంపై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారీకర్‌కు లెఫ్టినెంట్‌ జనరల్‌ బిపిన్‌ రావత్ తెలిపారు. దాంతో, అంతకు పదింతలు దెబ్బతీయాలని, ఈసారి దాడి అత్యంత తీవ్రంగా ఉండేలా చూడాలని సైన్యానికి మనోహర్ పారీకర్ సూచించినట్లు సమాచారం. భారీ దాడి వ్యూహానికి రంగం సిద్ధం చేయాలని ఆదేశించినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోట్ల రద్దును సర్జికల్ దాడులతో ఎలా పోల్చుతారు : బీజేపీ నేతలపై మోడీ ఫైర్