Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

30 ఏళ్లు దాటినా కాశ్మీర్ అమ్మాయిలకు పెళ్లి కావట్లేదట.. కారణం..?

30 ఏళ్లు దాటినా కాశ్మీర్ అమ్మాయిలకు పెళ్లి కావట్లేదట.. కారణం..?
, శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (17:08 IST)
marriage
భారత దేశంలో పెళ్లి కాని ప్రసాద్‌ల సంఖ్య పెరిగిపోతుందని.. తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా.. యువతులకు కూడా 30 ఏళ్లు నిండినా వివాహాలు జరగట్లేదట. దీంతో 50వేల మంది యువతులకు పెళ్లి వయస్సు వచ్చినా..30ఏళ్లు పూర్తి అయినా వివాహాలు కావటంలేదని ఓ ఎన్జీవో చేసిన సర్వే తెలిపింది.
 
భారత్‌లో చాలామంది అమ్మాయిలకు 20 ఏళ్లలోపే వివాహాలు జరిగిపోతాయి. కొంతమంది మాత్రం చదువు, ఉద్యోగాలు, ఉన్నతోద్యోగాల కారణాల వల్ల మాత్రం అతి కొద్ది శాతం యువతులు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు. అలా చూసుకున్నా 25 ఏళ్లకు వివాహాలు జరిగిపోతుంటాయి. 
 
కానీ.. కాశ్మీర్‌లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెళ్లీడొచ్చినా.. వయసు మీద పడి 30 ఏళ్లు దాటిపోతున్నా.. పెళ్లిళ్లు కాని స్త్రీలు వేల సంఖ్యలో ఉన్నారు. 
 
దానికి కారణాలేంటి? అనే అంశంలోకి వెళ్తే.. కాశ్మీర్ లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్లు అవ్వక.. అవివాహితలుగా ఉంటున్న స్త్రీల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందట. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 50 వేల మంది స్త్రీలు కాశ్మీర్‌లో పెళ్లిళ్లు కాకపోవటంతో అలాగే కన్నవారితోనే ఉండిపోతున్నారు. అంటే పుట్టింట్లోనే ఉండిపోతున్నారు.
 
అలా శ్రీనగర్ జిల్లాలోనే 10 వేల మంది మహిళలకు పెళ్లిళ్లు కాకుండా ఉండిపోయారని ఇటీవల తెహ్రీక్ ఈ ఫలా ఉల్ ముస్లిమీన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. అయితే ఇలా పెళ్లిళ్లు జరగకుండా ఉండిపోవడానికి ఆర్థిక కారణాలు మాత్రం కాదని సర్వే నిర్వహించిన సంస్థ వ్యవస్థాపకుడు అబ్దుల్ రషీద్ నాయక్ తెలిపారు. 
 
అమ్మాయిలకు వివాహాలు కాకపోవటానికి వారి చదువో..ఉద్యోగమో..లేదా వారి ఆర్థిక పరిస్థితులో కారణం కాదు. మంచి అల్లుడి కోసం వేచి చూసే తండ్రుల సంఖ్య పెరిగిపోతుందట. ఓ తండ్రి తన కూతురిని ఓ మంచి ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేస్తే.. వారి బంధువులు.. లేదా వారి ఇరుగు పొరుగు వారు వారి అమ్మాయిల్ని అంతకంటే పెద్ద ఉద్యోగం చేసేవారికో లేదా పెద్ద స్థాయిలో ఉన్నవారికో ఇచ్చి వివాహం చేయాలను అనుకోవటంతో ఇటువంటి అమ్మాయిలకు 30 ఏళ్లు దాటుతున్నా వివాహాలు కావటంలేదని అబ్దుల్ రషీద్ నాయక్ తెలిపారు.
 
అలా భావించిన ఎన్నో కుటుంబాలు వారి అమ్మాయిలకు ఏళ్లు గడుస్తూ వయసు మీద పడిపోయి అసలు పెళ్లే కాకుండా యువతులు ఉండిపోతున్నారని ఆయన వాపోయారు. ఈ తరం కుర్రాళ్లలో ఎక్కువ శాతం మంది చదువుకున్న అమ్మాయిలనో, ఏదో ఒక ఉద్యోగం చేసే యువతులనో మాత్రమే పెళ్లిళ్లు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారని తమ సర్వేలో వెల్లడయిందని తెలిపారు.
 
చదువు లేకుంటే కట్నాలు ఎక్కువగా అడుగుతున్నారనీ.. అంత మొత్తంలో ఇచ్చుకోలేక కూడా పెళ్లిళ్లు జరగడం లేదని తేలిందని తెలిపారు. ఏది ఏమైనా సమాజంలో వస్తున్న మార్పుల వల్ల పెళ్లిళ్లు కాకుండా పుట్టింట్లోనే కాలం గడుపుతున్న యువతుల సంఖ్య పెరుగటం విచారకరమని తెహ్రీక్ ఈ ఫలా ఉల్ ముస్లిమీన్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు అబ్దుల్ రషీద్ నాయక్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు.. యువకుల టీమ్ అదుర్స్